BigTV English

OTT Movie : 7 ఏళ్లు మిస్సింగ్.. ఒరిజినల్ ఏంజిల్ గా తిరిగొచ్చే అమ్మాయి… హర్రర్ తో అల్లాడించే సిరీస్

OTT Movie : 7 ఏళ్లు మిస్సింగ్.. ఒరిజినల్ ఏంజిల్ గా తిరిగొచ్చే అమ్మాయి… హర్రర్ తో అల్లాడించే సిరీస్

OTT Movie : సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మికత అంశాలతో ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ లేపుతోంది. ఈ సిరీస్ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి, తిరిగి అద్భుతమైన శక్తులతో వస్తుంది. గతంలో ఏం జరిగిందనేదే ఈ స్టోరీ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ది ఓఏ’ (The OA) బ్రిట్ మార్లింగ్, జాల్ బాట్మాంగ్లిజ్ సృష్టించిన అమెరికన్ సూపర్నాచురల్-ఫాంటసీ సిరీస్. ఈ సిరీస్ 2016 డిసెంబర్ 16న మొదటి సీజన్‌ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది. ఈ సిరీస్‌లో బ్రిట్ మార్లింగ్ (ప్రైరీ జాన్సన్/ది ఓఏ), జాసన్ ఐసాక్స్ (డాక్టర్ హాప్), ఎమోరీ కోహెన్ (హోమర్), పాట్రిక్ గిబ్సన్ (స్టీవ్) ప్రధాన పాత్రలు పోషించారు. 8 ఎపిసోడ్‌లతో తెరకెక్కిన ఈ సిరీస్ కి IMDb లో 7.8/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

సిరీస్ ప్రైరీ జాన్సన్ (బ్రిట్ మార్లింగ్) అనే యువతితో మొదలవుతుంది. ఆమె ఏడు సంవత్సరాల క్రితం అంధురాలిగా అదృశ్యమై, ఇప్పుడు తన దృష్టిని తిరిగి పొంది, కొన్ని గాయాలతో తిరిగి కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు తనను తాను “ది ఓఏ” (ఒరిజినల్ ఏంజెల్) అని పిలుచుకుంటుంది. FBI ఆమె దత్తత తల్లిదండ్రులకు, ఇన్ని రోజులు ఆమె ఎక్కడ ఉంది. ఆమెకు చూపు ఎలా తిరిగి వచ్చింది అనే విషయాలను వివరించడానికి నిరాకరిస్తుంది. అంతే కాకుండా ఆమెను కనిపెట్టుకోమని నలుగురు హైస్కూల్ విద్యార్థులైన స్టీవ్ (పాట్రిక్ గిబ్సన్), ఫ్రెంచ్ (బ్రాండన్ పెరియా), బక్ (ఇయాన్ అలెగ్జాండర్), జెస్సీ (బ్రెండన్ మేయర్) తో పాటు, టీచర్ BBA (ఫిలిస్ స్మిత్)తో కలిసి ఒక సీక్రెట్ బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట ఒక ఖాళీ ఇంటిలో రహస్యంగా సమావేశమై, ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా ప్రైరీ తనకు గతంలో జరిగిన సంఘటనలను చెప్పడం ప్రారంభిస్తుంది.

ఆమె రష్యాలో ఒక సంపన్న తండ్రితో పెరిగిన నీనా అజరోవా అని, ఒక బస్సు ప్రమాదంలో ఆమె చిన్నతనంలో మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అంధత్వాన్ని పొందినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో, ఆమె ఖాతూన్ అనే ఆధ్యాత్మిక జీవిని కలుస్తుంది. అప్పటినుంచి ఆమె తనకు తాను “ఒరిజినల్ ఏంజెల్”గా పిలుచుకుంటోంది. అమెరికాలో ఆమెను దత్తత తీసుకున్న తర్వాత, ఆమె తన తండ్రిని కనుగొనేందుకు న్యూయార్క్‌కు పారిపోతుంది. ఇంతలో డాక్టర్ హంటర్ “హాప్” పెర్సీ (జాసన్ ఐసాక్స్) అనే శాస్త్రవేత్త ఆమెను కిడ్నాప్ చేస్తాడు. హాప్ ఆమె పై అధ్యయనం చేస్తూ, ప్రైరీని ఒక గాజు పంజరంలో బంధిస్తాడు. ఆమెను పదే పదే చంపి తిరిగి జీవించే ప్రయోగాలు చేస్తాడు. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. చివరికి ప్రైరీ ఎలా మారుతుంది ? శాస్త్రవేత్త ఎందుకు ఆమెపై ప్రయోగాలు చేస్తున్నాడు ? FBI ఆమెను ఎందుకు ఫాలో చేస్తోంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఒకే ఏరియాలో 40 మంది అమ్మాయిలపై… కన్పిస్తే చాలు వదలకుండా అదే పని… క్లైమాక్స్ రచ్చ రచ్చే

Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×