Movable AC Viral Video: తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. బుర్రపెట్టి ఆలోచిస్తే ఎంత కఠినమైన పనిని కూడా ఈజీగా సాల్వ్ చెయ్యొచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యొచ్చు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా మూవబుల్ ఏసీని తయారు చేశారు. ఏ గదిలో కావాలంటే ఆ గదిలో ఏసీ వచ్చేలా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రెండు గదుల్లో ఏసీ వచ్చేలా..
సాధారణంగా ఏసీ అనేది ఏదో ఒక గదిలో ఫిక్స్ చేస్తారు. లేదంటే హాల్ లో పెడతారు. ఒక్క చోట దాన్ని బిగిస్తే, అటు ఇటు కదిలించడం సరికాదు. కానీ, ఓ వ్యక్తి మూవబుల్ ఏసీని తయారు చేశాడు. గోడకు ఓ మందం పాటి చెక్కను ఫిక్స్ చేశాడు. ఆ చెక్కను కదిలేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మూవబుల్ చెక్కకు ఏసీని బిగించాడు. ఆ ఏసీ ఎటు కావాలంటే అటు కదిలేలా చేశాడు. ఆ ఏసీని అలాగే ఉంచితే ఒక గదిలో, దాన్ని మూవ్ చేస్తే మరో గదిలోకి ఏసీ వచ్చేలా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also: గరం చాయ్ తాగుతూ సింహంతో ముచ్చట్లు.. ఎలా వస్తాయి బ్రో ఇలాంటి ఐడియాలు!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఏసీ ఫిక్స్ చేసిన వ్యక్తి ఆలోచనకు ఫిదా అవుతున్నారు. రెండు గదుల్లో ఏసీ కావాలి అనుకునే వాళ్లకు ఇదో మార్గదర్శకం కాబోతుందంటున్నారు. పెద్ద పెద్ద ఇంజినీర్లకు సైతం రాని ఆలోచన ఓ సాధారణ వ్యక్తికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇంకాస్త బుర్రకు పదును పెడితే మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆలోచనలు ఎన్నో ఉన్నా నిరూపించుకునే వాళ్లు లేక ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఎవరికీ తెలియని వారిలా మిగిలిపోతున్నారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Read Also: మూడు కాళ్ల సుందరాంగుడు.. 16 వేళ్లు.. 2 జననాంగాలు.. ఇతడిది ఓ అరుదైన జన్మ!