కుటుంబ సభ్యులకు ఊహించని బహుమతులు ఇస్తే వచ్చే కిక్ వేరు. చైనాకు చెందిన ఓ వ్యక్తి కూడా తన అమ్మమ్మ కోసం ఎవరూ ఇవ్వలేని బహుమతి ఇచ్చాడు. ఏకంగా ఆకాశానికే నిచ్చెన వేసి అబ్బుర పరిచాడు. తన అమ్మమ్మ మీద ఉన్న ప్రేమను తన పనితనంలో చూపించడు. ఏకంగా ప్రపంచాన్ని ఫిదా చేశాడు. అతడు మరెవరో కాదు కై గువో-కియాంగ్. చైనాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు. గన్ పౌడర్ తో అద్భుతమైన బాణాసంచా కళను సృష్టించడం దిట్ట. ఇంతకీ తన అమ్మమ్మను ఎలా ఆశ్చర్య పరిచాడంటే..
బానా సంచాతో అద్భుతాలు
కై గువో-కియాంగ్ 1957లో చైనాలోని క్వాన్ జౌలో జన్మించాడు. బాణాసంచాను ఎంతో కళాత్మకంగా కాల్చడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కియాంగ్ రంగు రంగుల బాణసంచా ప్రపంచ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక తన అమ్మమ్మ బర్త్ డే సందర్భంగా ఓ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా1,650 అడుగుల పొడవైన స్కై లాడర్ ఏర్పాటు చేశాడు. ఒక పెద్ద హీలియం బెలూన్ ద్వారా ఆకాశానికి నిచ్చెన వేసినట్లు కనిపిస్తుంది. చీకటిలో మెరుస్తూ అద్భుతంగా ఆకట్టుకుంది. బాణా సంచా మెరుపులు ఆకాశంలోకి వెళ్తూ నిచ్చెన వేసినట్లు గా అలరించింది. ఈ కళాకృతి అందంగా ఉండటమే కాకుండా తనకు ఇష్టమైన అమ్మమ్మకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చారు.
స్కై లాడర్ కోసం ఏళ్ల కళ
నిజానికి కై చిన్నతనం నుంచే స్కై లాడర్ గురించి ఆలోచించాడు. ఆకాశాన్ని చేరే అగ్ని నిచ్చెనను తయారు చేయాలనుకున్నాడు. ఈ కలను నిజం చేసుకోవడం అంత సులభం కాదని తెలుసు. అంతకు ముందు మూడుసార్లు ప్రయత్నించాడు. 1994లో UKలోని ఓసారి ప్రయత్నించాడు. కానీ, బ్యాడ్ వెదర్ కారణంగా సక్సెస్ కాలేదు. 2001లో చైనాలోని షాంఘైలో సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ విఫలం అయ్యాడు. 22012లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.
Read Also: మూడు కాళ్ల సుందరాంగుడు.. 16 వేళ్లు.. 2 జననాంగాలు.. ఇతడిది ఓ అరుదైన జన్మ!
అమ్మమ్మకు 100 ఏళ్ల సందర్భంగా…
2015లో కై తన స్వస్థలమైన క్వాన్ జౌలో స్కై లాడర్ ఏర్పాటు చేశాడు. జూన్ 15న ఉదయం 4:49 గంటలకు సీక్రెట్ గా దీనిని రూపొందించాడు. తన 100 ఏళ్ల అమ్మమ్మకు ఆశ్చర్యం కలిగించాలని ఆయన ఈ స్కై లాడర్ ఏర్పాటు చేశాడు. 2 నిమిషాల పాటు ఆకాశంలోకి వెళ్లే ఈ స్కై లాడర్ కోసం కై ఎన్నో దశాబ్దాలు కష్టపడ్డాడు. చివరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆమె వీడియో కాల్ లో చూసి ఎంజాయ్ చేసింది. వాళ్ల అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఈ స్కై లాడర్ క్రియేట్ చేసిన నెల రోజు తర్వాత ఆమె చనిపోయింది. ఈ స్కై లాడర్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది.
Read Also: కదిలే ఏసీ.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలోకి.. ఇతడి ఐడియాకు నిజంగా పిచ్చోళ్లైపోతారు!