They Call Him OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు సుజిత్. సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలి అని ఒక అభిమానికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ సాధించడమే దీనికి నిదర్శనం.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈరోజు వస్తుంది అని ఎప్పటినుంచో అనౌన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రమోషన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఎట్టకేలకు ఎదురుచూస్తున్న సాంగ్ వచ్చేసింది.
పాట అదిరింది
ఈ పాట గురించి అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ నెలకొంది. చాలా బీభత్సమైన అంచనాలు ఉండేది. అంచనాలన్నిటిని ఈ పాట సక్సెస్ఫుల్ గా నిలబెట్టింది. “అలలిక కడలిక భయపడలే” అని లిరిక్ తో మొదలైన ఈ పాట నిజంగా పవర్ఫుల్ గా ఉంది. కొన్ని పవన్ కళ్యాణ్ విజువల్స్ తో, అద్భుతమైన ఎలివేషన్స్ తో, పవర్ఫుల్ ఎడిట్స్ తో, అలానే లిరిక్స్ తో ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది. “పగ రగిలేను ఫైరు” వంటి లిరిక్స్ పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేయటానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో రికార్డులు షేక్ అవడం ఖాయం అని చాలామంది ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.