Baaghi 4 Trailer: కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఎ .హర్ష (A.Harsha)బాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హర్ష దర్శకత్వంలో ప్రసిద్ధ బాఘి4(Baagji 4) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. దాదాపు 3 నిమిషాల 41 సెకన్ల ట్రైలర్ వీడియోలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చూపించారు.
రక్తపు మరకలతో సంజయ్ దత్…
టైగర్ ష్రాఫ్(Tiger Shroff) , సంజయ్ దత్ (Sanjay Dutt)మద్య భారీ స్థాయిలో పోటీ ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. యాక్షన్ లవ్ స్టోరీ గా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో కేవలం యాక్షన్స్ సన్ని వేషాలు మాత్రమే కాకుండా లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ట్రైలర్ ద్వారా చూపించారు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.ట్రైలర్‌లో నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంజయ్ దత్ భయంకరమైన పాత్రలో కనిపించబోతున్నారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇక ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావడంతో సెప్టెంబర్ 5వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా విడుదల చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. తాజాగా ట్రైలర్ మాత్రం సినిమా పట్ల మరింత బజ్ క్రియేట్ చేసింది.టైగర్ మరియు సంజయ్ దత్‌లతో పాటు, ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా మరియు ఉపేంద్ర లిమాయే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో 2016 వ సంవత్సరంలో ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం తెలుగులో ప్రభాస్ నటించిన వర్షం సినిమా అలాగే ఇండోనేషియా హిట్ ది రైడ్: రిడంప్షన్ నుండి ప్రేరణ పొందిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందించారు.. ఇందులో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ మరియు సుధీర్ బాబు నటించారు. దీని సీక్వెల్, అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన బాఘీ 2 (2018), దిశా పటాని, మనోజ్ బాజ్‌పేయి మరియు రణదీప్ హుడా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మూడో భాగాన్ని కూడా అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక త్వరలోనే నాలుగవ భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.