Tollywood:ఈమధ్య కాలంలో హీరోలు, హీరోయిన్లు సినిమాల ద్వారా వచ్చే డబ్బును.. వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది బిజినెస్ లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇంకొంతమంది గోల్డ్ పై కూడా పెట్టుబడి పెట్టి భవిష్యత్తు తరాలకు పునాదులు వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా మంచినీళ్ల వ్యాపారం మొదలుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇక్కడ ఒక్కో లీటర్ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ వాటర్ బాటిల్ ధర ఎంత? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
మంచినీళ్లు అమ్ముకుంటున్న హీరోయిన్.. ధర ఎంత అంటే?
ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్(Bhumi padnekar). తన సోదరితో కలిసి ఒక వాటర్ బ్రాండ్ కంపెనీని మొదలుపెట్టింది..ఇక్కడ అర లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారుగా 150 రూపాయలు.. అలాగే 250 ml వాటర్ బాటిల్ రూ.200 కు లభిస్తోంది. ఇకపోతే ఈ వాటర్ ఇంత ఖరీదు ఎందుకు అనే విషయానికి వస్తే.. ఇది హిమాలయ వాటర్.. ఇందులో సహజ సిద్ధమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయట. ఇప్పుడు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పైన అందరూ ఆధారపడుతున్నారు.. పైగా వీటి కోసం భారీగా డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు ఈ హిమాలయ వాటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతోంది భూమి పడ్నేకర్.
‘బ్యాక్ బే ఆక్వా’ పేరిట వాటర్ కంపెనీ ప్రారంభించిన హీరోయిన్..
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..” నేను నా చెల్లెలు సమీక్ష పడ్నేకర్ తో కలిసి ‘బ్యాక్ బే ఆక్వా’ అనే వాటర్ బ్రాండ్ కంపెనీని స్థాపించాము. ఈ వాటర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్లలో లభ్యం అవుతుంది .దీని స్పెషాలిటీ ఏమిటంటే ప్యాకేజింగ్ కోసం మేము ప్లాస్టిక్ ని వాడడం లేదు. బాటిల్ క్యాప్ కూడా సులభంగా భూమిలో కలిసిపోయే మెటీరియల్ తోనే తయారు చేయించాం.. పూర్తిగా పర్యావరణ స్పృహతోనే ఈ వాటర్ కంపెనీని మేము మొదలు పెట్టాము” అంటూ ఈ మేరకు ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా షేర్ చేసింది భూమి పడ్నేకర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెట్టుబడి పై స్పందించిన భూమి పడ్నేకర్..
భూమి పడ్నేకర్ ఈ కంపెనీ పెట్టడానికి కావలసిన పెట్టుబడిపై కూడా మాట్లాడుతూ..” నేను 17 సంవత్సరాల వయసు నుంచే సంపాదించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాను. ఆ డబ్బుతోనే ఇప్పుడు ఈ కంపెనీని ప్రారంభించగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే అప్పట్లో సేవింగ్ చేసిన డబ్బు.. ఇప్పుడు ఇలా కంపెనీ పెట్టడానికి కారణం అయ్యింది అంటూ కూడా తెలిపింది భూమి. ఇక ఈ రంగంలో ఆమె సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link