Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Niddhi Agerwal) హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమయ్యింది..అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే .. ఇందులో చార్మినార్ కనిపించింది.
హరిహర వీరమల్లు కథలో చార్మినార్..ఎలా?
దీంతో ప్రస్తుతం అందరూ ఈ చార్మినార్(Charminar) గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ -1 సినిమాను.. ఎవరి ఆధారంగా అయితేహరిహర వీరమల్లు సినిమా తీస్తున్నారో.. ఆయన 1355 లోనే చనిపోయారు.కానీచార్మినార్ ఏమో 1591 లో నిర్మించారు.మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకుంది? అసలు హరిహర వీరమల్లు కథలోకి చార్మినార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లో కథలోకి చార్మినార్ ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనే విషయాలపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
ఎవరీ వీరమల్లు? ఆయన కథేంటి?
ఇదే సమయంలో ఎవరు ఈ వీరమల్లు.. ?ఆయన కథ ఏంటి? అనే విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు 900 సంవత్సరాల క్రితం భారతదేశంలో పెను ప్రమాదాలు ముంచు కొచ్చాయి.. ఎంతోమంది సుల్తానులు ఇండియా పైకి దండెత్తి వచ్చి, ముస్లిం రాజ్యాంగా మార్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.అలా ఎన్నో యుద్ధాలు చేసి చివరికి దక్షిణ భారతదేశంలో పూర్తిగా ఇస్లాం మతాన్ని వ్యాపింపచేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో దక్షిణ భారతదేశం మొత్తం హిందుత్వం వ్యాపించి ఉంది. కానీ వారి మధ్య సఖ్యత లేదు. అదే సమయంలో ఢిల్లీలో మహమ్మద్ బీన్ తుగ్లక్ పీఠాన్ని అధిరోహించాక.. భారతదేశ పరిస్థితి మరింత అద్వానంగా మారింది. ఆ టైమ్ లో వరంగల్ (Warangal)సామ్రాజ్యం పతనం అయినప్పుడు అక్కడ 2వ ప్రతాప రుద్రుని (Pratahaparudra) ఆస్థానంలో కోశాధికారులుగా పనిచేసే వీర హరిహర(Veera Hari Hara), బుక్క (Bukka) ఇద్దరు సోదరులు కంపలికి వెళ్లిపోయి, అనెగొండి ఆస్థానంలో చేరారు. కానీ అదే సమయంలో కంపలిని స్వాధీనం చేసుకున్న మహమ్మద్ బీన్ తుగ్లక్ హరిహర, బుక్కా ఇద్దరినీ బందీలుగా చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు.
స్వతంత్ర సామ్రాజ్యం కోసం అన్నదమ్ముల పోరాటం..
ఆ తర్వాత కంపలి ప్రజలు తిరుగుబాటు చేయడంతో హరిహర, బుక్కా ఇద్దరికీ మహమ్మద్ బీన్ తుగ్లక్ స్వేచ్ఛనిచ్చి సైనికులతో కంపలిని స్వాధీనం చేసుకురమ్మని పంపారు. దాంతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి కంపలిని స్వాధీనం చేసుకున్నారు. వీర హరిహర కంపలికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ హిందూ మతంలోకి మారి విజయనగర సామ్రాజ్య(Vijayanagara Empire) స్థాపనకు నాంది పలికారు. అలా శత్రువుల నుండి తన ప్రజల్ని రక్షిస్తూ.. అనెగొండి రాజధానిగా పనికి రాదని, తన సోదరుడు బుక్కాకి రాజధాని పనులు అప్పగించారు. అలా 1943లో వీర హరిహర సోదరుడు బుక్కా విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తి చేశాడు.
వీరమల్లు కథలోకి చార్మినార్ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ తర్వాత 1944లో విజయనగరాన్ని రాజధానిగా చేశారు. అలా వీర హరిహర స్థాపించిన విజయనగర రాజ్యన్ని వాళ్ళ వారసులు పాలించారు. అయితే అలాంటి వీర హరిహర చరిత్రనే హరిహర వీరమల్లు సినిమా(Hari Hara Veeramallu Movie)లో చూపిస్తున్నారు.అయితే హరిహర వీరమల్లు చనిపోయింది 1355లో. కానీ కులీ కుతుబ్ షా (Quli Qutub Shah) 1591లో చార్మినార్ ని కట్టించారు.మరి 1355లో చనిపోయిన హరిహర వీరమల్లు కాలంలో ఈ చార్మినార్ ఎక్కడినుండి వచ్చింది అని హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
ALSO READ:HHVM Trailer: ఆర్ఆర్ఆర్ ను కాపీ కొట్టిన డైరెక్టర్.. పూనమ్ చెప్పింది నిజమేనా?