Tollywood : సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. మరో మాటలో చెప్పాలంటే ఒక మాయాజాలం. మాయలు మంత్రాలు వచ్చిన వాళ్లే ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటారని ఇప్పటికి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని ఎంతోమంది స్టార్లు చెప్పుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చిన్న పొరపాట్ల వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది వేరే వాళ్ళను గుడ్డిగా నమ్మి మోసపోయిన వారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈమధ్య ఇండస్ట్రీలో అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. ఓ డైరెక్టర్ హీరోయిన్ ను నమ్మించి మోసం చేశాడు అంటూ ప్రస్తుతం ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అన్నది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శరీరకంగా ఆమెను వాడుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవకాశాల పేరుతో ఆయన హీరోయిన్ ను నమ్మించి శారీరకంగా అనేక సార్లు ఆమెను వాడుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఆ కుర్ర డైరెక్టర్ రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కొన్ని మంచి విజయాన్ని అందుకున్నా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీలో అతనికి మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో అతను తెలియని వాడైతే కాదు. ప్రస్తుతం అతను ఒక మలయాళ హీరోతో పెద్ద ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ పేరు ఇప్పటివరకు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే డైరెక్టర్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది.
డైరెక్టర్గా తన పలు సినిమాలకు పనిచేస్తున్నట్లు నమ్మించి హీరోయిన్ ని బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో తో సినిమా చేస్తున్న ఆ డైరెక్టర్ పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయన చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ హీరో తో చేస్తున్న సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఆయన కెరియర్ కి ఎఫెక్ట్ పడుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ నమ్మించి శారీరకంగా వాడుకొని, పెళ్లి పేరు తీసుకురావడంతో మొహం చాటేసినట్లు తెలుస్తుంది. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ చిన్నది పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదుకు ఫిర్యాదు చేస్తుంది. హీరోయిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి అతని రిమాండ్ కు పంపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ ఆరోపణలు తనపై నిజమని తేలు తే అతనికి కచ్చితంగా మంచి శిక్ష పడుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్ అవడంతో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
🚨 Tollywood Shocking Update!
మలయాళ స్టార్‌తో సినిమా చేస్తున్న ఒక యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు!
పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ నటి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య.
👀 Big Clue: ఈ డైరెక్టర్ పేరు ఒక పాపులర్ టాలీవుడ్ హీరో పేరుతో సమానం!
Guess who? 👇…— BIG TV Cinema (@BigtvCinema) August 26, 2026
Also Read :యష్ ‘టాక్సిక్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?