E-Paper
Advertisement

Tollywood: ఈ సినిమాలు ఎందుకు వాయిదా పడుతున్నాయ్.. బిజినెస్ ప్రాబ్లమా?

Tollywood: ఈ సినిమాలు ఎందుకు వాయిదా పడుతున్నాయ్.. బిజినెస్ ప్రాబ్లమా?
Advertisement

Tollywood: ఈ శుక్రవారం టాలీవుడ్ (Tollywood) బాక్సాఫీస్‌ను పలకరించేందుకు చాలా సినిమాలే ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ రిలీజ్ అంటూ చాలా సినిమాలు అనౌన్స్‌మెంట్ ఇచ్చాయి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అంటూ చివరి నిమిషంలో రెండు సినిమాలు.. సేమ్ రీజన్ చెబుతూ వాయిదా వేస్తున్నట్లుగా ఆ సినిమాల మేకర్స్ ప్రకటన చేశారు. చివరి నిమిషంలో సేమ్ రీజన్‌తో ఎందుకని ఈ సినిమా వాయిదా పడ్డాయి? థియేటర్లు దొరకలేదా? లేదంటే సరిగా బిజినెస్ జరగలేదా? అనేలా కామెంట్స్ మొదలయ్యాయి. థియేటర్ల సమస్య అనుకోవడానికి సంక్రాంతికి 5 సినిమాలు వచ్చి, ఎటువంటి ఇష్యూ లేకుండా బాగానే థియేటర్లలో ఆడాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అలాగే పోయిన శుక్రవారం వచ్చిన సినిమాలేవీ మంచి సక్సెస్ సాధించలేదు. కాబట్టి థియేటర్ల పరంగా ఇష్యూ ఉండకపోవచ్చు. మరి బిజినెస్ పరంగానా? అలా అనుకోవడానికి రేపు రిలీజ్ అనగా ఇలాంటి ప్రకటనలు చేయరు కదా. మరి ఏమై ఉంటుంది? అనేలా అంతా సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ వాయిదా పడిన ఆ సినిమాలు విడుదల చేసిన ప్రకటనలు ఏంటంటే..

Also Read- Tollywood Events: గెస్ట్‌లు రావడం లేదని ఏడ్వడం కాదు.. ముందు ఇలాంటివి చూసుకోండి?

‘చాయ్ వాలా’ వాయిదా

Advertisement

హర్షిక ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ముందస్తుగా ఊహించని కొన్ని అనివార్య కారణాల వల్ల, మా రాబోయే చిత్రం ‘చాయ్‌ వాలా’ (CHAI WALA) విడుదల తేదీని మారుస్తున్నామని మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు హర్షిక ప్రొడక్షన్స్ తెలియజేస్తోంది. మొదట ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. మీరు మాపై చూపిస్తున్న నిరంతర మద్దతు, అవగాహనకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కొత్త తేదీన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని టీమ్ హర్షిక ప్రొడక్షన్స్ పేర్కొంది. ఈ సినిమాలో శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read- Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్  దెబ్బకు షేక్ అయిన హాట్ స్టార్.. ఇలా ఉన్నారేంట్రా బాబు..

‘స్కై’ మూవీ వాయిదా..

Advertisement

వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ తమ రాబోయే చిత్రం ‘స్కై’ (Sky) విడుదల తేదీని మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొన్ని ఊహించని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, తాజా మార్పు ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమకు నిరంతరం మద్దతు తెలుపుతున్న ప్రేక్షకులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా చిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలా రెండు సంస్థలు ఒకే విధంగా ప్రకటన విడుదల చేయడంతో ఈ ఊహించని కారణాలు ఏమై ఉంటాయి? అనేది తెలియాల్సి ఉంది. ‘స్కై’ మూవీలో మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read- Gunasekhar: మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టకూడదు.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×