BigTV English

Tollywood : ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాలీవుడ్ విలన్..

Tollywood : ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాలీవుడ్ విలన్..

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్నగాక మొన్న దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్తని ఇంకా మర్చిపోలేని టాలీవుడ్ ప్రేక్షకులకు మరో వార్త షాక్ ఇచ్చింది. తాజాగా టాలీవుడ్ లో విలన్ పాత్రలు వేస్తూ ప్రేక్షకులను అలరించిన బోరబండ భాను మృతి చెందాడు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆయన అనేక చిత్రాల్లో ప్రతినాయకుడి బృందంలో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఓ మిత్రుడి ఆహ్వానంతో భాను గండికోట వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి సంతోషంగా పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దాంతో కన్నుమూశారు.. ఆ ప్రమాదం గురించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..


రోడ్డు ప్రమాదం బోరబండ భాను మృతి..

గండికోటలోని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి స్నేహితులతో వెళ్లాడు. అమ్మవారి దర్శనం అయ్యాక స్నేహితులతో సరదాగా గడిపాడు భాను. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్లీ స్నేహితులతో కలిసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బొత్కూర్‌ సమీపంలోకి రాగానే కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో ఉన్న భాను మరణించారు. స్నేహితులతో సరదాగా గడపాలని వెళ్లిన భాను ఇక లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఆయన స్నేహితులు సైతం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ తోడుగా ఉండే స్నేహితుడు దూరమయ్యాడని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


భాను చివరి వీడియో..

ఈ ప్రమాదానికి ముందు భాను ఒక వీడియోని రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. అందులో గండిపేట వచ్చా… ఫుల్‌ ఎంజాయ్ చేస్తున్నా” అంటూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. భాను ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.

?igsh=bDl2cTVzbzBwNTQ4

Also Read : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న భాను.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు బోరబండ భాను.. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో భాను ఎంతో సాదాసీదాగా, ఫన్నీ పర్సన్‌గా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. సినిమా శ్రేణుల్లో ఆయన అందరితో సరదాగా కలిసిపోయే తత్వం, సహజంగా పలకరించే తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులుకు ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన అంత్యక్రియలకు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని వరస మరణాలు కుదిపేస్తున్నాయి. ఒకే నెలలో ముగ్గురు చనిపోవడం బాధాకరం. ఈ వార్తని తెలుగు సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×