BigTV English

Gold rush in China: చైనా రోడ్లపై జనాలు.. 20 కేజీల బంగారం కోసం వెతుకులాట, అసలు మేటరేంటి?

Gold rush in China: చైనా రోడ్లపై జనాలు.. 20 కేజీల బంగారం కోసం వెతుకులాట, అసలు మేటరేంటి?

Gold rush in China: చైనాలో కొన్ని రోజులుగా భారీ వరదలు సంభవించాయి. షాంగ్జీ ప్రావిన్స్‌లో వర్షాల కారణంగా ఓ బంగారం షాపు నుంచి పసిడి, వెండి ఆభరణాలు కొట్టుకొచ్చాయి. వాటిని సొంతం చేసుకునేందుకు ఆ విధంగా స్థానికులు పోటీపడ్డారు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బంగారానికి మార్కెట్లో డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎవరికైనా చిన్న ముక్క దొరికినా అదృష్టం పండినట్టే. ఆ రేంజ్‌లో ధరలు ఉన్నాయి. కొద్దిరోజులుగా చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యం గా షాంగ్జీ ప్రావిన్స్‌ ప్రాంతం వరదలకు చిగురుటాకులా వణికింది. వరదల సమయంలో ఊళ్లు, షాపులు భారీగా డ్యామేజ్ అయ్యాయి.

అదే సమయంలో నగల షాపు నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. పలు షాపుల్లో బంగారం కొట్టుకుపోయింది. పోయిన బంగారం కోసం రోడ్లపై వెతికే పనిలోపడ్డారు స్థానికులు. వుచి కౌంటీలో జులై 26న బంగారం షాపులు కొట్టుకుపోయినట్టు సమీపంలో ఓ ప్రాంత ప్రజల చెవిలో పడింది.


ఎందుకంటే ఈ ప్రాంతం సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. స్థానికంగా షాపు ఓనర్ షాపుని ఓపెన్ చేశాడు. సిబ్బంది చూస్తుండగానే వరద నీరు షాపులోకి చొచ్చు కొచ్చింది. వరద ఉద్ధృతి కళ్ల ముందే షాపులోని బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి.

ALSO READ: భూకంపం వచ్చినా సర్జరీ మాత్రం డాక్టర్లు ఆపలేదు, ఎక్కడ?

వాటిలో బంగారు హారాలు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, వజ్రం ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఏకంగా 20 కిలోల బంగారం ఆభరణాలు గల్లంతైనట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 12కోట్ల పైమాటే అన్నమాట.  బంగారం కొట్టుకుపోయిన విషయం స్థానికులు తెలిసింది.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వరదలు వచ్చిన సమీప ప్రాంతాల్లోని వీధుల్లోకి చేరి బంగారం కోసం స్థానిక ప్రజలు వెతకడం మొదలుపెట్టారు. తమకు దొరికిన ఆభరణాలను కొందరు తమకు ఇచ్చేశారని షాపు యజమాని తెలిపారు. ఆ విధంగా కేజీ బంగారం వచ్చిందన్నారు. దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా.. ఇంకా 19 కేజీల బంగారం కనిపించలేదు. వాటి కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు.

చాలామంది స్థానికులు దొరికిన బంగారం ఇవ్వడానికి మొగ్గు చూపలేదని జియా వోయ్ చెప్పాడు. ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఆ స్థాయి ధర ఉండడమే కారణం. అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి ఎక్కువగా చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది.

 

Related News

Viral Video: ఈయన దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Big Stories

×