Illu Illalu Pillalu ToIlluday Episode july 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. రైస్ మిల్లుకు వెళ్లిన నర్మద సాగర్ ని చూసి నర్మదా బాధపడుతుంది రామరాజు మాత్రం సాగర్ మీ భార్యని దగ్గర దించిరా అని అంటాడు.. ప్రేమ ఇంట్లో పనులు చేయడం చూసి బాధపడిన ధీరజ్.. నువ్వు అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు.. నీ భార్య అనే ట్యాగ్ నాకు ఉంది కదా.. నువ్వు నన్ను భార్యగా గుర్తించకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నేను నీ భార్యనే. మీ పెద్ద వదిన ఇవంతా చేయమని చెప్పింది అని ప్రేమ అనగానే నేను ఇప్పుడే వెళ్లి వదినను అడుగుతాను అని ధీరజ్ అంటాడు. ఏమని అడుగుతావు? ఎందుకు అడుగుతావని ప్రేమ అంటుంది. దీంట్లో వస్తువుతో సమానం అన్నావు కదా నా గురించి ఎందుకు నువ్వు అడగాలి అని ప్రేమ. ధీరజ్ ని కడిగి పడేస్తుంది ప్రేమ. సాగర్ ప్రేమను డ్రాప్ చెయ్యడానికి వస్తాడు. నర్మద నేను రాను అని చెప్పి వెళ్ళిపోతుంది. రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు శ్రీవల్లి రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు కోడళ్లతో కలిసిపోయాడేమో అని కావాలని గుర్తు చేస్తుంది శ్రీవల్లి. శ్రీవల్లి మీరు అందుకేనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొనిందని మరోసారి అగ్గి రాజేస్తుంది.. ఇంకా ధీరజ్, సాగర్ నాన్న కళ్ళలో నీళ్ళు చూడడం మనకు బాధగా అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు.. నర్మదా తప్పు చేసింది అని అంటాడు సాగర్. ధీరజ్ మాత్రం వదిన తప్ప ఏమీ లేదురా అంతా ప్రేమదే తప్పు అని అంటాడు. ప్రేమది నర్మది ఇద్దరిదీ తప్పే అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన చందు.. ప్రేమ నర్మల్ది కాదురా తప్పు. మీరిద్దరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే ఒకరి ప్రేమని ఒకరు అంగీకరించి అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు కదా.. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి.
అంతేకానీ ఇంట్లోకి జరుగుతున్న గొడవలు కి వాళ్లే కారణమని వాళ్ళ మీద తోసేస్తున్నారు అని చందు అంటాడు. నీ భార్యల గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగులుతుంది అని చందు అంటాడు. నువ్వు కష్టపడ్డాం చూడలేకే ప్రేమ జాబ్ చేయాలని అనుకునింది. తన గురించి నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు ఇంత గొడవలు జరిగేవి కాదు కదా అని చందు అంటాడు. నువ్వంటే ప్రేమకి చాలా ప్రేమ అని చందు అంటాడు.. ఇక ప్రేమ నర్మదా ఇద్దరూ బాధపడుతూ ఉంటారు..
మనకి ఈ ఇంట్లో విలువలేదు అని ఒకరికొకరు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. మనకి ఎన్ని రోజులు అత్తయ్య ఉండడం వల్ల అమ్మ విలువ తెలిసేది కాదు. అమ్మ లేని లోటుని మనకు అత్తయ్య తీర్చేది.. ఇప్పుడు ఇంట్లో గొడవలు మనకి వ్యతిరేకంగా చేశాయి.. అత్త లేదు కాబట్టి ఈ కన్నీళ్లు దిగమింగుకోవడం కష్టంగా ఉందని అక్క చెల్లెలు ఇద్దరు కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఆ మాట విన్న వేదవతి కోడల కోసం కరిగిపోతుంది.. కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది.
అమ్మ మాట వినిపిస్తే చంపేస్తాను అని అంటుంది.. కాళ్ళు విరగగొట్టి చేతిలో పెడతాను అని వేదవతి అంటుంది.. మరి నేను ఎవరిని దెయ్యాన్ని ఇద్దరు కోడలతో కలిసిపోతుంది. వీళ్ళు నిజంగానే కలిసిపోయారని శ్రీవల్లి పీడకల కంటుంది. అది తెలుసుకొని ఇలాంటి పీడకలు వచ్చిందేంటి అని నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. లేవగానే తాళాలు ఎవరో తీసుకున్నట్లు వెతుక్కుంటుంది.. నేను ఇంట్లో కోడలుగా ఉన్నన్ని రోజులు ఈ తాళాలు నా దగ్గరే ఉండాలి.. పెత్తనం నాతోనే ఉండాలి… రామరాజు గొర్రె లాగా నేను ఏం చెప్తే అది తలాడిస్తూ ఉండాలని అనుకుంటుంది.
ఎలాగో లేచాం కదా ఇద్దరు కోడల్ని ఒక ఆట ఆడుకుందాం అని అనుకుంటుంది.. అప్పుడే ఎవరో నవ్వుకున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి.. అది విన్న శ్రీవల్లి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళ ముగ్గురు నవ్వుతూ కనిపించడం చూసి ఒక్కసారిగా టపీమని కింద పడిపోతుంది. నర్మద ప్రేమ ఇద్దరు కలిసి నీళ్లు కొట్టి శ్రీవల్లిని లేపుతారు. ఏంటి బల్లక్క అలా కింద పడిపోయావని అడుగుతారు. ముగ్గురు కలిసి పోయారా అని శ్రీవల్లి అడుగుతుంది. శ్రీవల్లికి తెలిస్తే ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుందని వేదవతి నర్మద వాళ్ళు పెద్ద నాటకమే ఆడి శ్రీవల్లిని బురిడీ కొట్టిస్తారు.
Also Read :ప్రణతి పెళ్లి గురించి చెప్పేసిన పార్వతి.. ఇంట్లో పెద్ద రచ్చ.. నిజం బయటపెట్టిన ప్రణతి..
ఆ తర్వాత సేటు రామరాజు అంటూ వస్తాడు. అది గమనించిన చందు అక్కడికి వచ్చి సేటును బ్రతిమలాడి పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన నర్మదా ఏంటి ప్రాబ్లం బావగారు అని అడుగుతుంది. నా జాబుకు సంబంధించినదని చెప్పాను కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అందరం కలిసి సాల్వ్ చేద్దామని నర్మదా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఏంట్రా కంగారు పడుతున్నావ్.. ఏదైనా సమస్య? అసలు నువ్వు అమాయకుడివి ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. ఏం లేదు నాన్న అని చందు అంటాడు. నర్మదను కూడా ఈ విషయం గురించి మర్చిపో చిన్న విషయమే నేను చూసుకుంటాను అని అంటాడు. శ్రీవల్లి దగ్గరికి వెళ్లిన చందు మీ నాన్న వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎంప్టీ చెక్కించి మోసం చేస్తారా..? ఇప్పుడే అక్కడికి వెళ్లి తేల్చుకుందాం పదండీ అని బలవంతంగా శ్రీవల్లిని లాక్కొని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..