Big Tv Kissik Talk Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ఎప్పటికప్పుడు కొత్త షోలను ప్రారంభిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కిస్సిక్ టాక్స్ ( Kissik Talk Show) ను నిర్వహిస్తుంది. ఈ షో కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహారిస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని తమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ షో కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పల్లవి ప్రశాంత్ కు అవమానం..
ఈ షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. తన జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, భరించిన అవమానాలను బయటపెట్టాడు. ఓ సందర్భంలో ఒక అతను వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చీప్ గా మాట్లాడాడు అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. దాంతో సిటీకి వచ్చి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. అలానే వీడియోలతో అందరికీ దగ్గరయ్యాను. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాను అని పల్లవి ప్రశాంత్ అన్నాడు.
నా తండ్రిని చూసి గుండె తరుక్కుపోయింది..
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఆనందం ఆరక్షణంలోనే ఆవిరి అయిపోయింది. గెలిచాను అన్నా ఆనందం లేకుండానే కన్నీళ్లు మిగిలాయి అని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.. ఎప్పుడూ నా తండ్రిని అలా చూడలేదు.. కోర్టు బయట నాకోసం వెయిట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా గుండె తరుక్కుపోయింది. ఆ క్షణం నేను ఎంత కుమిలిపోయానో నాకు తెలుసు అని పల్లవి ప్రశాంత్ అన్నాడు.
Also Read: ‘కింగ్డమ్’ మూవీలో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?
రతికా రోజ్ గురించి షాకింగ్ కామెంట్స్..
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రతికా రోజ్ తో ప్రేమాయణం నడిపిన విషయాన్ని వర్ష అడిగింది.. హౌస్ లో ఉన్నప్పుడు అలా అనిపించింది కానీ బయటకు వచ్చిన తర్వాత అదేమీ లేదు అని అన్నాడు.. బయటికి వచ్చిన తర్వాత కనీసం ఫోన్ కూడా మాట్లాడలేదని వర్షా అడగ్గా.. అస్సలు లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశాడు పల్లవి ప్రశాంత్. అవసరానికి వాడుకున్నారు బయటకు వచ్చిన తర్వాత వదిలేసారు అని అనిపించిందని చెప్పకనే చెప్పేసాడు. చివరగా ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. మొత్తానికి ఈ ప్రోమో అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఎపిసోడ్ లో ఇంకేన్ని విషయాలు షేర్ చేసుకున్నాడో చూడాలి..