E-Paper
Advertisement

‘టాక్సిక్’లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లెక్క చూస్తే మైండ్ బ్లాక్!

‘టాక్సిక్’లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లెక్క చూస్తే మైండ్ బ్లాక్!
Advertisement

Toxic Remuneration:టాక్సిక్ ..KGF తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా ఎట్టిపరిస్థితుల్లో చూడాలని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఇక అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఒక రేంజ్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.

అయితే సినిమా డివైడ్ టాక్ రావడంతో పెట్టిన బడ్జెట్ రాబడుతుందా లేదా అన్న అనుమానాలు మొదలైపోయాయి. దీంతో అసలు ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.మరి ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత పుచ్చుకున్నారో మనమూ ఒకసారి చూసేద్దాం.

యష్ పారితోషికం కాకుండా 

Advertisement

ముందుగా ఈ సినిమా హీరో విషయానికి వస్తే యష్ ఈసినిమా కోసం పారితోషికం తీసుకోకుండా KVN ప్రొడక్షన్ హౌస్ తో కలిసి వచ్చిన లాభంలో వాటా  తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.సినిమాపై భారీ అంచనాలు ఉండటం, సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈజీగా ఒక రెండొందల కోట్లు వెనకేయోచ్చని ప్లాన్ వేసినట్టున్నాడు,కానీ సినిమాకి వస్తున్న టాక్ చూస్తుంటే రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటే బాగుండు అనుకుంటాడేమో కాబోలు.

also read :ఇరుముడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. టాప్-5లోకి ఎంట్రీ!

కియారా అద్వానికి ఏకంగా రూ.21 కోట్ల పైనే

Advertisement

ఇక సినిమాలో నటించిన మిగతా వారి విషయానికి వస్తే ..సినిమాని ఒక రేంజ్ లో అల్లాడించిన కియారా అద్వానికి ఏకంగా రూ.21 కోట్ల పైనే అప్పగించినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.ఇక ఎప్పుడూ ప్రమోషన్స్ కి రాని నయనతార కి కూడా దాదాపు 17 కోట్ల పైనే ఇచ్చి ప్రమోషన్స్ కి వచ్చేలా చేశారట.

ఇక ఇప్పుడిప్పుడే స్టార్ లీగ్ లోకి దూసుకువస్తున్న రుక్మిణీ వసంత కి దాదాపు 4కోట్ల పైనే ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తమ వంతు కీలక పాత్రలు పోషించిన హ్యూమా ఖురేషీకి ,అలాగే తారా సుతారియాకి చెరో రెండున్నర కోట్ల దాకా ముట్టచెప్పిందట KVN.

ఎంత లేదన్నా 500 కోట్ల బడ్జెట్ పైకే

ఇక ఈ సినిమాకి పని చేసిన మెయిన్ టెక్నీషియన్స్ అయిన డైరెక్టర్, అండ్ మిగతా టీమ్ కి దాదాపు 150కోట్లు, అలాగే మేకింగ్ కి మరో వంద కోట్ల వరకు KVN ఖర్చు పెట్టినట్టు వినిపిస్తుంది.అంటే ఈ సినిమా ఎటూ చూసినా పారితోషికాలు,గ్రాండియర్ మేకింగ్ ,ప్రమోషన్స్, రిలీజ్ ..ఇలా అన్నీ కులుపుకుని చూస్తే ఎంత లేదన్నా 500 కోట్ల బడ్జెట్ పైకే లెక్క తేలుతుంది.

also read :టాక్సిక్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంతో తెలుసా ?

ఏమైనా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుందేమో

మరో వైపు తెలుగు రాష్ట్రాల రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు ఈ సినిమాని మనీ రిటర్న్ ప్రాసెస్ లో తీసుకున్నట్టు తెలుస్తుంది.అంటే సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా 15 రోజుల్లో డబ్బులు వెనక్కి ఇచ్చేయ్యాలన్న మాట.అంటే ఎటు చూసినా KVN కే నష్టం.మరో వైపు  సినిమాకి వచ్చిన టాక్ చూస్తే KVN కి KD, జననాయకుడు లాగా ఈ సినిమా కూడా గట్టిగా బొక్క పెట్టేలా ఉంది. చూడాలి మరి సాగుతుతున్న కొద్ది ఏమైనా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుందేమో !

Tags

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×