E-Paper
Advertisement

మూడు సార్లు మడతపెట్టే ఫోన్.. Huawei Mate XT 2లో ఇవన్నీ ఉంటాయా?

మూడు సార్లు మడతపెట్టే ఫోన్.. Huawei Mate XT 2లో ఇవన్నీ ఉంటాయా?
Advertisement

Huawei Mate XT 2: పెద్ద స్క్రీన్, సన్నని డిజైన్, శక్తివంతమైన పనితీరు.. ఈ మూడు అంశాలను ఒకేసారి అందించే ఫోల్డబుల్ ఫోన్‌పై హువావే ఫోకస్ పెట్టింది. కంపెనీ తదుపరి ట్రిపుల్-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Huawei Mate XT 2ను సెప్టెంబర్ 7న అధికారికంగా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇదే ఈవెంట్‌లో HarmonyOS 7ను కూడా హువావే ప్రకటించే అవకాశం ఉంది.

10 అంగుళాలకు పైగా భారీ డిస్‌ప్లే:

మేట్ XT 2లో పూర్తిగా విప్పినప్పుడు 10 అంగుళాలకు పైగా స్క్రీన్ లభించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. మూడు భాగాలుగా మడిచే డిజైన్‌తో సాధారణ ఫోల్డబుల్ ఫోన్ల కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ అందించనుంది. ఫోన్‌ను మడిచినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌గా, పూర్తిగా విప్పినప్పుడు టాబ్లెట్‌లా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Also Read: Poco F9 Ultraపై భారీ అంచనాలు.. కొత్త చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌తో ఎంట్రీ!

సన్నని డిజైన్, కొత్త హింజ్:

భారీ డిస్‌ప్లే ఉన్నప్పటికీ మేట్ XT 2ను చాలా సన్నగా రూపొందించేందుకు హువావే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా విప్పినప్పుడు ఫోన్ మందం సుమారు 3.6 మిల్లీమీటర్లు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త హింజ్ కారణంగా స్క్రీన్‌పై కనిపించే క్రీజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే రక్షణ కోసం UFG (Ultra Thin Glass)ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం.

కిరిన్ చిప్, ఆన్-డివైస్ ఏఐ:

Advertisement

పనితీరు విషయంలో మేట్ XT 2లో గణనీయమైన అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చని తెలుస్తోంది. లీకుల ప్రకారం ఇందులో కిరిన్ 9050 ప్రో చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఆన్-డివైస్ AI ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. అయితే ఈ వివరాలను హువావే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

నాలుగు రంగుల్లో:

మేట్ XT 2ను మిస్టిక్ బ్లాక్, ఆస్పీషియస్ రెడ్, క్రిమ్సన్ పర్పుల్, వైట్ రంగుల్లో విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ధర, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా వివరాలు, ఛార్జింగ్ స్పీడ్ వంటి అంశాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. సెప్టెంబర్ 7న జరిగే ఈవెంట్‌లో హువావే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Also Read: వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×