Pruthviraj : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రేమ పక్షులు అంటే విష్ణు ప్రియ,పృథ్వీ పేర్లు టక్కున గుర్తొస్తాయి. హౌస్ లో వీరిద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే విష్ణు ప్రియ కు పృథ్వి అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే బయటపెట్టింది. కానీ పృథ్వి మాత్రం తనకు ఇష్టం లేదు కేవలం ఫ్రెండ్ అంటూనే విష్ణు తో తిరిగాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ జంట పలు ఇంటర్వ్యూ చానల్స్ కు జంటగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇకపోతేతాజాగా కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2లో కూడా వీళ్లిద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ లవ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదో క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ..
పృథ్వీని ప్రేమిస్తున్న విష్ణు ప్రియ..
మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో కొందరు జంటల మధ్య ప్రేమను పుట్టించి కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు బిగ్ బాస్ నిర్వాహకులు.. ఇప్పటివరకు వచ్చిన సీజన్ లో అలానే శ్రుతిమించిన సీన్లను హౌస్ లో చూపించారు.. అయితే అవన్నీ కేవలం కంటెంట్ కోసమే అని అందరికీ తెలుసు. బయటికి వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో మాత్రం అలా జరగలేదు. హౌస్ లో ఉన్నప్పుడు లవ్ ట్రాక్ నేను నడిపిన విష్ణు ప్రియ బయటకు వచ్చిన తర్వాత కూడా అతనిపై ప్రేమను చంపుకోలేదు. ఏ షో కి వెళ్ళినా వీళ్ళిద్దరూ హైలెట్ అయ్యారు. ఈ ఇద్దరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పృథ్వీ మంచి ఆటగాడే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ, పృథ్వీలు తమ ప్రేమ పై వస్తున్న రూమర్స్ గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. ముందుగా విష్ణు ప్రియ మాట్లాడుతూ.. పృథ్వీ మంచి క్రీడాకారుడు.. రకరకాల ఆటలు ఆడతాడు.. చాలా మంచివాడు అంటూ గట్టిగానే పులిహోర కలిపింది విష్ణు. ఇక రెండో రౌండ్ ‘ముద్దు’ అని చెప్పగానే విష్ణు చాలా ఎక్సైట్ అయిపోయింది. పృథ్వీకి ముద్దు ఇవ్వాలా ఇచ్చేస్తా అంటూ విష్ణు ప్రియ అనడంతో యాంకర్ నిఖిల్ ఆగమ్మా తల్లో నాది 18 ప్లస్ షో కాదు అంటూ ఒక్క క్షణం అవాక్కయ్యాడు.. ఇక ఎపిసోడ్ మొత్తం పృథ్వీని అడుక్కుంటుంది విష్ణు ప్రియ.
Also Read: హేమ చంద్ర అంత టార్చర్ చేశాడా..? శ్రావణ భార్గవి షాకింగ్ పోస్ట్..!
పృథ్వీ రియాక్షన్ ఇదే..
ఆ తర్వాత పృథ్వీ మాట్లాడుతూ.. మరి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా.. అని నిఖిల్ అడిగాడు. నాకు అయితే పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు.. ఇంట్రెస్ట్ వస్తే చేసుకుంటా.. అయినా దానికి మినిమమ్ టూ ఇయర్స్ పడుతుంది అని అంటాడు. దానికి విష్ణు 2 ఇయర్స్ ఏ కదా ఏం పర్లేదు వెయిట్ చేస్తాను అన్నట్టుగా అంటుంది.. ఇక మరి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? వీరిద్దరి మధ్య అసలు ఏ బంధం ఉంది అన్న సందేహాలు ఈ ఎపిసోడ్ ని చూసిన తర్వాత అందరికీ వస్తుంటాయి. దీని గురించి వీళ్లే బయట పెడతారేమో వెయిట్ చేయాలి..