Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండకు(Vijay Devarakonda) ఊహించని షాక్ తగిలింది. విజయ్ దేవరకొండపై గిరిజన(Tribles) సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ తన పట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అసలు విజయ్ దేవరకొండపై గిరిజనులు వ్యతిరేకత చూపించడానికి గల కారణమేంటి? అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఇటీవల విజయ్ దేవరకొండ హీరో సూర్య(Suriya) నటించిన రెట్రో సినిమా(Retro Movie) ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగిన నేపథ్యంలో ఈయన కూడా ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కాశ్మీర్ లో నిత్యం ఇలాంటి యుద్ధాలు గొడవలు జరుగుతున్నాయి. వాటికి పరిష్కారం వారికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం, బ్రెయిన్ వాష్ చేయడమేనని తెలిపారు. కాశ్మీర్ ఇండియాది, కాశ్మీరీలు ఇండియన్స్ అంటూ మాట్లాడారు. పాకిస్తాన్ పై మనం యుద్ధం చేయాల్సిన పనిలేదు అక్కడ వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు భరించలేక వాళ్లే పాకిస్తాన్ గవర్నమెంట్ పై తిరగబడతారు అటు మాట్లాడారు.
ఆపరేషన్ సింధూర్..
ఇప్పుడు కూడా ఇలా యుద్ధాలు చేసుకోవడం ఏంటి గత 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా ఇలా గొడవ పడుతున్నారు అంటూ ఆయన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో గిరిజనులను ఏకంగా ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడారంటూ గిరిజన సంఘాలు మండిపడుతూ ఈయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఉగ్రవాదులతో పోల్చటం…
ఇలా గత నెల రోజుల క్రితం విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు ఆయనపై కేసు పెట్టడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.. విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడట్లేదని, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా గత నెల రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యల పై విజయ్ దేవరకొండపై ఇప్పుడు కేసు నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించిన కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు
500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారన్న విజయ్ దేవరకొండ
గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు… pic.twitter.com/gQshALyLbo
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025