Instant Coffee Health Risk Blindness | కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. అయితే దాని వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టంట్ కాఫీ తాగడం వల్ల కంటి చూపును దెబ్బతీసే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. చైనాలోని హుబెయ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఇన్‌స్టంట్ కాఫీ వల్ల ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (వయసు మీరడం వల్ల వచ్చే కంటిచూపు సమస్యలు – AMD) అనే కంటి వ్యాధి రావచ్చని కనుగొన్నారు. ఈ వ్యాధి 50 ఏళ్లు దాటిన వారిలో కంటి చూపు మసక బారుతుందని లేదా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల చెప్పారు.నిపుణుల ప్రకారం.. ఇది వృద్ధులు కంటి చూపు నష్టపోవడానిక ఒక ప్రధాన కారణం, అయితే పూర్తి అంధత్వానికి దారితీయదు. సమయానికి చికిత్స చేయించకపోతే.. ఈ వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చదవడం, ముఖాలను గుర్తించడం కష్టమవుతుంది.
ఈ అధ్యయనంలో 5 లక్షల మంది జన్యు డేటాను విశ్లేషించారు. ఇన్‌స్టంట్ కాఫీ తాగడం, డ్రై AMD (AMD యొక్క ఒక రకం) మధ్య సంబంధం ఉందని తేల్చింది. అయితే.. గ్రౌండ్ కాఫీ, డీకాఫ్ కాఫీలకు AMDతో ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నారు. కేవలం ఇన్‌స్టంట్ కాపీతో ఈ సమస్య అని తెలిపారు. “ఇన్‌స్టంట్ కాఫీ తాగడం, డ్రై AMD మధ్య జన్యు సంబంధం ఉందని మా ఫలితాలు చూపించాయి. ఇన్‌స్టంట్ కాఫీ AMD ప్రమాదాన్ని పెంచుతుంది, దాని వినియోగాన్ని తగ్గించడం డ్రై AMD నివారణకు సహాయపడుతుంది. AMD ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఇన్‌స్టంట్ కాఫీని నివారించాలి” అని హుబెయ్ యూనివర్సిటీలోని శియాన్ తైహే హాస్పిటల్‌లోని నేత్ర విభాగంలోని సివీ లియు.. ‘ఫుడ్, సైన్స్ అండ్ న్యూట్రిషన్’ జర్నల్‌లో రాశారు. AMD సాధారణ కంటి వ్యాధి.. “తిరిగి సరిచేయలేని అంధత్వానికి ప్రధాన కారణాల్లో ఒకటి” అని పరిశోధకులు తెలిపారు.
ఇన్‌స్టంట్ కాఫీ AMDకి ఎలా దారితీస్తుంది?
కాఫీ వల్ల AMD ఎలా వస్తుందో స్పష్టంగా తెలియకపోయినా.. జన్యు కారకాలు ఈ వ్యాధి అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి యొక్క కారణాలు అస్పష్టంగా ఉండటం, చికిత్స సంక్లిష్టత వల్ల, వ్యాధి పురోగతిని నిదానించడం మరియు సకాలంలో నివారణ చాలా ముఖ్యం. గతంలో కొన్ని అధ్యయనాలు కాఫీ తాగడం AMD ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పాయి, కానీ ఈ కొత్త అధ్యయనం కాఫీ రకాలను విడిగా పరిశీలించి భిన్న ఫలితాలను ఇచ్చింది. ఇన్‌స్టంట్ కాఫీ తాగడం మరియు డ్రై, వెట్ AMD రెండింటికీ జన్యు సంబంధం ఉందని తేలింది. ఇన్‌స్టంట్ కాఫీ తాగే అలవాటు, డ్రై AMD ప్రమాదం మధ్య జన్యు ఒడిదొడుకులు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇన్‌స్టంట్ కాఫీలోని ప్రాసెసింగ్ ఉప ఉత్పత్తులు, యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, రసాయనాలు AMD ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనం సూచిస్తుంది.
ఇన్‌స్టంట్ కాఫీలో ఉండే రసాయనాలు
అధ్యయన డేటా ప్రకారం.. ఇన్‌స్టంట్ కాఫీలో అక్రిలమైడ్ (క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం), ఆక్సిడైజ్డ్ లిపిడ్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తాజా కాఫీలో ఉండవు. ఈ రసాయనాలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. AMD తొలి దశలో ఉన్నవారు ఇన్‌స్టంట్ కాఫీ తగ్గించి, గ్రౌండ్ కాఫీ బీన్స్‌ను ఎంచుకోవాలని ఇతర అధ్యయనాలు సూచిస్తున్నాయి.
AMD లక్షణాలు
మాక్యులర్ డీజనరేషన్ కేంద్ర చూపును (Eye Sight Blindness) దెబ్బతీస్తుంది, రెటినాను నాశనం చేస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు పూర్తిగా అంధులు కాదు, వారి పక్క చూపు సరిగ్గా ఉంటుంది. AMD యొక్క లక్షణాలు:
Also Read: దేశంలో బరువు తగ్గించే మాత్రలకు పెరుగుతున్న డిమాండ్.. ఆరోగ్యానికి సురక్షితమేనా?
AMD ప్రమాదాన్ని తగ్గించడానికి ఇన్‌స్టంట్ కాఫీ తాగడం మానేయండి. గ్రౌండ్ కాఫీ లేదా డీకాఫ్ కాఫీ ఎంచుకోండి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. AMD లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సలహా తీసుకోండి.