Trisha Krishnan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గత కొంతకాలంగా ప్రముఖ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. గతంలో పెళ్లి, విడాకులపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు విజయ్ తో పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిష అప్పుడు చేసిన కామెంట్లను ఇప్పుడు వైరల్ చేయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సౌత్ సినీ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా అదే స్టార్ హోదాతో దూసుకుపోతున్న త్రిష.. ఎప్పటికప్పుడు తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇంకా సింగిల్ గానే ఉంటున్న ఈమె గతంలో తన వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ గా మారాయి.. పెళ్లిపై తనకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది అని చెప్పిన ఈమె.. తాను పెళ్లిని ఒక ఆటగా భావించడం లేదు అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు త్రిష మాట్లాడుతూ.. “ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకోను. జీవితాంతం నాతో కలిసి ఉండే వ్యక్తి కోసమే నా అన్వేషణ.. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా అవుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా అవుతున్నాయి” అంటూ అటు పరోక్షంగా కూడా ప్రస్తావించింది.
also read:వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?
ఇకపోతే ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ..” నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎంతోమంది ఇలా పెళ్లిళ్లు చేసుకొని ప్రస్తుతం తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కేవలం సమాజం కోసమో, వయసు అయిపోతుందనో పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకోలేను. నా స్నేహితుల లాగా నేను బాధపడాలని అనుకోవడం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి, నాకు సరిపోయే వ్యక్తి వస్తేనే వివాహ బంధంలోకి అడుగు పెడతాను” అంటూ త్రిష స్పష్టం చేసింది. ఇకపోతే అలాంటి తోడు దొరకకపోతే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు కూడా ఆమె బదులిచ్చింది. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా అయినా ఉండిపోవడానికి సిద్ధమే అంటూ తెలిపింది. మొత్తానికైతే త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే త్రిష చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ని బట్టి చూస్తే విజయ్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్లు చేసిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా త్రిష చేసిన పెళ్లి, విడాకుల వార్తలు ఇప్పుడు మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారి ఆమెను మళ్ళీ వార్తల్లో నిలిచేలా చేశాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు త్రిష వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరో తమిళ చిత్రంలో కూడా ఈమె అవకాశాన్ని అందుకుంది.