Venkatesh:ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న విక్టరీ వెంకటేష్ (Venkatesh) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 65 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా మరోసారి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ ఆ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో సందడి చేసి మెప్పించారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆదర్శ కుటుంబం ఏకే 47 టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. తాజాగా ఈ ఎదురు చూపులకు తెర దించుతూ మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వెంకటేష్ 77వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ..” ప్రతి కుటుంబం గుర్తించుకోవాల్సిన విషయం.. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబడతాయి” అంటూ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. మొత్తానికైతే గతంలో దసరాకి రాబోతోందని వార్తలు వినిపించగా.. అంతకంటే ముందే ఈ సినిమాను ఆడియన్స్ కోసం తీసుకొస్తూ ఉండడం గమనార్హం.
మరోవైపు అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. ఆ సమయంలో ఎలాగో స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు. ఆ సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉండుంటే ఇంకాస్త కలెక్షన్లు బాగా పెరిగేవేమో.. ఈ విషయాన్ని మేకర్స్ కాస్త ఆలోచించాల్సింది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి మేకర్స్ నిజంగానే విడుదలను వాయిదా వేసుకుంటారా? లేక గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
also read:ఖుష్బూ కుమార్తె పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. ఈమె ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్!
విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఈయన మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇందులో కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తుండగా.. కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
A date for every family to remember ❤️
The doors of #AadarshaKutumbam open worldwide on OCTOBER 2nd ✨#AK47OnOCT2nd#AK47 | #Venky77 | #VenkateshXTrivikram
#Trivikram @SrinidhiShetty7 @musicthaman #SRadhaKrishna @dop007 @sreekar_prasad #AsPrakash @kevinkumarrrr… pic.twitter.com/oH45fw8it4— Venkatesh Daggubati (@VenkyMama) June 27, 2026