E-Paper
Advertisement

ఖుష్బూ కుమార్తె పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. ఈమె ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్!

ఖుష్బూ కుమార్తె పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. ఈమె ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Advertisement

Trisha Krishnan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan)గత కొంతకాలంగా నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అటు ఒకవైపు తన వరుస సినిమా లైనప్ తో ఇటు విజయ్ తో రిలేషన్ కారణంగా నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్న ఈమె.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి తన ఫ్యాషన్ జువెలరీతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లిలో సందడి చేసి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. పైగా అందరి చూపు ఆమె ధరించిన నెక్లెస్ పైనే పడడం గమనార్హం. మరి త్రిష ఆ పెళ్లి వేడుకలో ధరించిన నెక్లెస్ ధర , దాని ఖరీదు అలాగే దాని వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఖుష్బూ కూతురు పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్..

ప్రముఖ సీనియర్ హీరోయిన్ గా , రాజకీయ నాయకురాలిగా మంచి పేరు దక్కించుకున్న ఖుష్బూ.. ఇటీవల తన కుమార్తె అవంతిక, శ్రవణ్ కుమార్ పెళ్లి గోవాలోని ఒక రిసార్టులో సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిపించారు. ఇక ఈ వేడుకకి తమన్నా, చిరంజీవి, త్రిష వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యి సందడి చేశారు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో త్రిష అందరి దృష్టిని ఆకట్టుకుంది.

త్రిష ధరించిన నెక్లెస్ ధర ఎంతంటే?

Advertisement

ముఖ్యంగా ఈమె ధరించిన ఎమరాల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొలంబియన్ ఎమరాల్డ్స్ తో తయారైన లగ్జరీ పీస్ కావచ్చని జువెలరీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీని విలువ సుమారుగా రూ.3 కోట్ల నుండి రూ.4కోట్ల వరకు ఉండొచ్చనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.పైగా ఈ నెక్లెస్ లో పోల్కి డైమండ్స్ వాడడంతో ఈ నెక్లెస్ కి రాయల్ లుక్ మరింత పెరిగింది. ఈ వేడుకలో త్రిష వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో డిజైన్ చేసిన పట్టు చీర కట్టుకుంది. దీనికి కాంబినేషన్లో క్రీమీ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ బ్రాండ్ కు చెందిన ఈ అవుట్ ఫిట్ సుమారుగా రూ.2లక్షల నుండి 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.. ఏదేమైనా కుష్బూ కూతురి పెళ్లిలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

also read:కన్నప్ప మూవీకి ఏడాది.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

త్రిష కెరియర్..

Advertisement

త్రిష కెరియర్ విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభరలో అవని పాత్రలో నటిస్తోంది. 2026 వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడింది. ఇకపోతే అవంతిక పెళ్లిలో చిరంజీవితో త్రిష ఎక్కువ సమయం గడపడం అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి అయితే సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ జంట ఇక్కడ చర్చించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

Big Stories

Advertisement
×