E-Paper
Advertisement

ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం!

ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం!
Advertisement

Tata Fast Charging Hub in Hyderabad: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కొత్త హై-స్పీడ్ టాటా.ఈవీ మె గాఛార్జర్ హబ్‌ ను ప్రారంభించాయి. ఈ కొత్త ఛార్జింగ్ కేంద్రాన్ని హైటెక్ సిటీలోని ఐల్యాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశాయి.  హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి.

ఒకేసారి 6 ఈవీలకు ఛార్జింగ్

ప్రస్తుతం నగరంలో వ్యక్తిగత ఈవీలతో పాటు టాక్సీ సేవలు, కార్పొరేట్ వాహనాలు, కమర్షియల్ ఫ్లీట్లు, ఇంటర్‌ సిటీ ప్రయాణాలు చేసే వాహనాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ వాహనాలకు త్వరగా, ఈజీగా ఛార్జింగ్ అందించడమే ఈ మెగాఛార్జర్ హబ్ ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ఈ ఛార్జింగ్ హబ్ లో మొత్తం 360 కిలోవాట్ల ఛార్జింగ్ సామర్థ్యం ఉంది. ఇందులో మూడు 120 కిలోవాట్ల హైస్పీడ్ ఛార్జింగ్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

24 గంటల పాటు ఛార్జింగ్ సేవలు

Advertisement

ఈ ఛార్జింగ్ స్టేషన్ రోజుకు 24 గంటల పాటు పనిచేస్తుంది. దీంతో వాహనదారులు ఎప్పుడైనా తమ కార్లను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేసే వారు, క్యాబ్ డ్రైవర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. సాధారణ ఛార్జింగ్ స్టేషన్లతో పోలిస్తే ఈ హై స్పీడ్ మెగాఛార్జర్ హబ్‌ లో ఛార్జింగ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈవీ వినియోగదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు దేశవ్యాప్తంగా వేగంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ మెగాఛార్జర్ హబ్ భవిష్యత్తులో పెరగనున్న ఈవీ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ వెల్లడించింది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి, ప్రజలు ఈవీల వైపు మళ్లించేలా చేయడానికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ హై-స్పీడ్ టాటా.ఈవీ మెగాఛార్జర్ హబ్ సిటీ ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ డీటైల్స్ లీక్.. వామ్మో.. సింగిల్ ఛార్జ్ తో అంత రేంజా!?

Related News

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

Big Stories

Advertisement
×