Ram Gopal Varma: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా తనకు అనవసరమైన విషయాలలో కూడా జోక్యం చేసుకొని వార్తల్లో నిలుస్తూ ఉంటారని, ఇప్పటికే ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే అవేవి తనకు పట్టవని, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా.. ఐ డోంట్ కేర్ అంటున్నారు వర్మ. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
వాస్తవాన్ని గ్రహించాను అంటున్న వర్మ..
ప్రముఖ సినీ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాంగోపాల్ వర్మ తొలిసారి విమర్శకులపై తనదైన శైలిలో స్పందించారు. విమర్శ ఏదైనా సరే దాని గురించి మంచిగా లేదా చెడుగా స్పందించడం మానేశానని స్పష్టం చేశారు. విమర్శ అనేది సినిమా పరిశ్రమలో అంతర్భాగమే అనే ఒక వాస్తవాన్ని నేను గ్రహించాను. అందుకే విమర్శకులు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా.. నాదైన శైలిలో సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తాను అంటూ రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే వాస్తవాన్ని గ్రహించానని వర్మ చెప్పడంతో ఇక విమర్శకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్ని కాంట్రవర్సీలు చేసినా పట్టించుకోడేమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
రాంగోపాల్ వర్మ కెరియర్..
ఇక రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న వర్మ.. నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో ఈయన సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా.. తర్వాత హిందీ సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు వర్మ. ఇక ఆయనకు పేరు తెచ్చి పెట్టిన చిత్రాలలో శివ, క్షణక్షణం, రంగీలా, సత్య, కంపెనీ , భూత్ వంటి చిత్రాలు ఈయనను దర్శకుడిగా నిలబెట్టాయి. ‘వర్మ కార్పొరేషన్’ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి.. పలు చిత్రాలు నిర్మిస్తున్నారు వర్మ
తొలిసారి ఆయన గురించి ఎమోషనల్ అయిన వర్మ..
ఇకపోతే రాంగోపాల్ వర్మ ఈమధ్య పలు విషయాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత 4 రోజుల క్రితం దిగ్గజ నటుడు కోటా శ్రీనివాస రావు తుది శ్వాస విడవడంతో.. ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనగనగా ఒకరోజు మూవీ సెట్స్ లో కోటా తో ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసి.. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆర్జీవి సంతాపం వ్యక్తం చేశారు. నేను చూసిన గొప్ప నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. శివ, గాయం, సర్కార్, రక్త చరిత్ర, డబ్బు లాంటి సినిమాలకు ఆయన చేసిన కృషి గొప్పది. ఇప్పుడు మీరు వెళ్లిపోయి ఉండవచ్చు కానీ మీ పాత్రలు ఎప్పటికీ కూడా బ్రతికే ఉంటాయి అంటూ వర్మ పోస్ట్ చేశారు. అయితే ఒక మనిషి గురించి వర్మ ఇంత గొప్పగా ట్వీట్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్మపై పలువురు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
also read:Coolie Movie: కూలీ మూవీ నటీనటుల పారితోషకం.. ఎవరికి ఎక్కువంటే?