Lokesh Kanagaraj: ఒకప్పుడు తెరమీద కనిపించే హీరోలకు మాత్రమే అభిమానులు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాను తీసిన దర్శకుడు ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. డైరెక్టర్ను బట్టి కూడా సినిమాకు వచ్చే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అప్పట్లో దాసరి నారాయణరావు గారు దర్శకులకు మంచి గుర్తింపు వచ్చేలా చేశారు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు. తర్వాత కాలంలో పూరి జగన్నాథ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు కూడా మంచి పేరు సాధించుకున్నారు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అంటే హీరోలను దాటి దర్శకులను చూసి సినిమాలకు వచ్చే ఆడియన్స్ మొదలయ్యారు. ఇప్పుడు లోకేష్ కనకరాజు విషయంలో అదే జరుగుతుంది.
ఆ ఒక్క ట్వీట్ చాలు
లోకేష్ కనకరాజ్ మానగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన మాస్టర్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. మాస్టర్ సినిమా తర్వాత చేసిన విక్రమ్ సినిమా నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది. విక్రమ్ సినిమా మీద కొంతమేరకు మాత్రమే అంచనాలు ఉండేవి. కానీ విక్రమ్ సినిమా రేపు విడుదలవుతుంది అనే తరుణంలో, ఒకసారి ఖైదీ సినిమా చూసి విక్రం సినిమా చూడండి అని ముందు రోజు లోకేష్ కనగరాజ్ వేసిన ట్వీట్ విక్రమ్ హిట్ కి చాలా సహాయపడింది.
ఎవడు ఎక్స్పెక్ట్ చేయను విధంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు కూడా రేపు కూలీ సినిమా విడుదల సందర్భంగా, కూలీ సినిమా చూసేముందు ఖైదీ విక్రమ్ సినిమాలు చూసి రండి అని లోకేష్ చెబితే ఈజీగా 1000 కోట్లు వస్తాయి అనేది చాలామంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ
మామూలుగా డబ్బింగ్ సినిమాలకు పెద్దగా ఆదరణ లభించదు. కానీ ఈ సినిమాకు మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టిక్కెట్లు పెట్టిన వెంటనే బుక్ అయిపోతున్నాయి. గతంలో రజనీకాంత్ చేసిన సినిమాలు వచ్చినా కూడా ఇంత భారీ ఆదరణ ఆ సినిమాలకు లభించలేదు. కానీ ఇప్పుడు లోకేష్ దర్శకుడు అని తెలియడంతో ఈ సినిమా మీద భారీ హైప్ మొదలైపోయింది. ఈ సినిమా మీద ఉన్న హైట్ కి కొంచెం పాజిటివ్ టాక్ తోడైతే చాలు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి 1000 కోట్లు సినిమా వచ్చేసినట్లు.
Also Read: Anupuma Parameswaran: ప్రమోషన్ కి మా దగ్గర డబ్బులు లేవు, రివ్యూ నచ్చితే సినిమా చూడండి