Jio Recharge Plans: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం దాదాపు ఒకే ధరకు రెండు భిన్నమైన ప్లాన్లను అందుబాటులో ఉంచింది. రూ. 1,748, రూ. 1,799 ధరలతో వచ్చిన ఈ రెండు ప్లాన్లూ ధరల పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. బెనిఫిట్స్ పరంగా వీటిలో బోలెడు డిఫరెన్స్ లు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం జియో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల (11 నెలలు) పాటు యూజర్లు బెనిఫిట్స్ పొందొచ్చు. అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సేవలు యూజర్లకు లభించనున్నాయి. అయితే ఈ ప్లాన్లో ఎలాంటి డేటా లభించదు. ఒకవేళ డేటా అవసరమైతే మళ్లీ యాడ్ ఆన్ ప్యాక్స్ ను మళ్లీ రీఛార్జ్ చేసుకొని ఇంటర్నెట్ పొందాల్సి ఉంటుందని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
జియో దీనిని పక్కా ఆల్ రౌండర్ ప్లాన్ గా తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాల్స్ తో పాటు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే ప్రతీ రోజూ 3GB హై-స్పీడ్ డేటా, అర్హులకు అపరిమిత 5Gని జియో ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్లను సైతం అందిస్తోంది. అదే విధంగా రూ. 1,590 విలువైన 12 నెలల కన్వా ప్రో లైట్ సబ్స్క్రిప్షన్, 50GB క్లౌడ్ స్టోరేజ్, జియోటీవీ యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ కూడా ఈ ప్లాన్ బెనిఫిట్స్ కూడా లభించనుంది.
Also Read: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!
ధర పరంగా చూస్తే పై రెండు ప్లాన్లకు రూ. 49 డిఫరెన్స్ మాత్రమే తేడా ఉన్నప్పటికీ.. బెనిఫిట్స్ పరంగా పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. డేటాతో పెద్దగా పనిలేని వారికి రూ.1,748 ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దాదాపు 11 నెలలపాటు రీఛార్జ్ గురించి ఆలోచించే అవసరమే లేకుండా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అలా కాకుండా రోజూ అధిక డేటాతో అవసరం ఉండి, ఓటీటీలు కూడా చూసేవారైతే రూ.1799 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మీ అవసరానికి ఏ ప్లాన్ సరిపోతుందో దాన్ని ఎంచుకుంటే బెటర్.
Also Read: నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?