BigTV English

Udayabhanu: వారికి భయపడి పవన్ కళ్యాణ్ మూవీ మిస్ చేసుకున్నా – ఉదయభాను

Udayabhanu: వారికి భయపడి పవన్ కళ్యాణ్ మూవీ మిస్ చేసుకున్నా – ఉదయభాను

Udayabhanu: ఒకప్పుడు బుల్లితెరపై తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసింది ఉదయభాను (Udhayabhanu) . ముఖ్యంగా ఎన్నో సినిమా ఈవెంట్లకు హాజరవుతూ.. యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘త్రిభాణదారి బార్బరీక్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఉదయభాను రీఎంట్రీ ఇస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన స్పెషల్ సాంగ్ లో కూడా చేసి.. సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఇందులో ఉదయభాను విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 22న అంటే రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుసగా పాల్గొంటున్న ఉదయభాను.. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.


స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

ముఖ్యంగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. వారికి భయపడి అవకాశాన్ని కోల్పోయానని.. కానీ తానేమి బాధపడడం లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ఉదయభాను. మరి ఉదయభానుకి ఏ సినిమాలో అవకాశం వచ్చింది? అది ఏ పాత్ర? ఎందుకు ఆమె చేయలేదు? ఈమె భయపడింది ఎవరిని చూసి? అంటూ ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పవన్ కళ్యాణ్ మూవీని రిజెక్ట్ చేసిన ఉదయభాను..

ఉదయభాను.. యాంకర్ గానే కాకుండా అప్పట్లో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ముఖ్యంగా రానా(Rana ) హీరోగా నటించిన లీడర్ (Leader).. నాగబాబు (Nagababu) నటించిన ‘ఆపదమొక్కులవాడు’, అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘ జులాయి’ తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. ఇకపోతే ఇలా వరుసగా స్పెషల్ సాంగ్ లు చేస్తున్న ఉదయభానుకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయమని అవకాశం వచ్చిందట. కానీ దీనిని ఆమె రిజెక్ట్ చేసింది. ఈ విషయంపై ఆమె క్లారిటీ కూడా ఇవ్వడం గమనార్హం.

వారికి భయపడి చేయలేదు – ఉదయభాను

ఉదయభాను మాట్లాడుతూ… “అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమా తర్వాత త్రివిక్రమ్(Trivikram )దర్శకత్వం వహించిన ఇంకో సినిమాకు నాకు స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’. ఇందులో పార్టీ సాంగ్ కి నన్ను అడిగారు. అయితే నేను మొదట భయపడ్డాను.. ఎందుకంటే ఇది ఒక పార్టీ సాంగ్. అక్కడ చాలామంది ఉంటారు. అంతమంది స్టార్స్ లో నన్ను ఇగ్నోర్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. అప్పటికి డైరెక్టర్ ఎంతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నా మైండ్ సెట్ ను నేను మార్చుకోలేకపోయాను. అలా వారందరికి భయపడి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాన్ని కోల్పోయాను. అయితే ఆ సాంగ్ చేయనందుకు నేనేం బాధపడలేదు” అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ఉదయభాను. ప్రస్తుతం ఉదయభాను చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

also read: Vishwambhara Update: విశ్వంభర నుండీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

Related News

Disco Shanti: అయినవాళ్లే దూరం పెట్టారు.. ఆకలితో నరకం చూశాం – డిస్కో శాంతి

Kangana Ranaut: 40కి చేరువలో పెళ్లికి సిద్ధమవుతున్న కంగనా.. అదిరిపోయే రియాక్షన్!

Mirai Movie: భారీ ధరకు ‘మిరాయ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్ కు ముందే లాభాలు..

Theater Movies : రేపు థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు.. వీటిని డోంట్ మిస్..

Vishwambhara Update: విశ్వంభర నుండీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

Big Stories

×