Vishwambhara Update: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో విశ్వంభర(Vishwambhara ) కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిరంజీవి.. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఒకరోజు ముందుగానే మెగా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పైగా 70వ పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులు ఈ పండుగను మరింత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
విశ్వంభరపై చిరంజీవి అదిరిపోయే అప్డేట్..
ముఖ్యంగా ఈ బర్తడే చిరంజీవికి ఎప్పుడు గుర్తుండిపోయేలా స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి అని అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు చిత్ర బృందాలు కూడా భారీ ఎత్తున ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి(Anil Ravipudi) ‘మెగా 157’ నుండీ అప్డేట్ లు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా విశ్వంభర సినిమాపై ఒక బిగ్ అప్డేట్ విడుదల చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి.
ఆలస్యం సముచితమే – చిరంజీవి
ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ.. “నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. మీలో ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉంటుంది. ఎందుకు విశ్వంభర ఇంకా రాలేదు అని.. ఈ ఆలస్యం ఒకరకంగా మంచిదే అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా రెండవ భాగం మొత్తం గ్రాఫిక్స్ , విఎఫ్ఎక్స్ మీదే ఆధారపడి ఉంది. బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు రావాలి అని దర్శకనిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ కారణం చేతనే సినిమా ఆలస్యం అయ్యింది. ఇక ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సమయం ఇది. ముఖ్యంగా ఒక చందమామ కథల సాగిపోయే అద్భుతమైన కథ.
విశ్వంభర నుండి గ్లింప్స్.. అప్డేట్ వదిలిన చిరు..
చిన్నపిల్లలకు.. అటు పెద్ద వాళ్లలో ఉండే చిన్నపిల్లలకు సైతం ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా రూపొందించడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, నాకు యూవీ క్రియేషన్స్ వారు చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అనగా ఈరోజు సాయంత్రం 06:06 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ అందరినీ అలరిస్తుంది”. అంటూ చిరంజీవి తెలిపారు.
రిలీజ్ డేట్ పై చిరంజీవి క్లారిటీ..
అలాగే రిలీజ్ డేట్ పై ఆయన స్పందిస్తూ..” ఈ సినిమాను వచ్చే ఏడాది 2026లో వేసవి సందర్భంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాము. నాది భరోసా”.. అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇక అభిమానులు కూడా ఒక అంచనాకి వచ్చేస్తున్నారు.. మొత్తానికైతే వచ్చే ఏడాది రాబోయే ఈ సినిమాకి ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నామని చిరంజీవి ప్రకటించడంతో దీని కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వశిష్ట మల్లిడి (Vassishta mallidi) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తోంది.
?utm_source=ig_web_copy_link
also read: Shahrukh Khan: చేతికి గాయంపై స్పందించిన షారుఖ్.. ఒక్క చెయ్యి సరిపోతుందంటూ?