సముద్రర జలాల్లో ఎన్నో అద్భుతమైన జీవులు ఉంటాయి. వాటిలో మనకు తెలిసింది గోరంత. తెలియాల్సింది కొండంత. ఇప్పటి వరకు చాలా మంది గోల్డెన్ నర్స్ షార్క్ ల గురించి చెప్పడమే తప్ప ఎవరూ చూడలేదు. కానీ, తొలిసారి ఈ అరువైన షార్క్ కనిపించి అందరినీ అబ్బుర పరిచింది. టోర్టుగ్యురో నేషనల్ పార్క్ నుంచి 37 మీటర్ల లోతులో ఈ అరుదైన నారింజ రంగు షార్క్ కనుగొనబడింది. సుమారు రెండు మీటర్ల పొడవులో కనిపించింది. ఈ షార్క్ ను చూడ్డం ఇదే తొలిసారి కావడం విశేషం.
కోస్టారికాకు చెందిన డైవర్లు ఈ బంగారు వర్ణ గోల్డెన్ నర్స్ షార్క్ ను గుర్తించారు. సాధారణంగా షార్క్ లు బూడిద, గోధుమ రంగులో కనిపిస్తాయి. కానీ, తొలిసారి ప్రకాశవంతమైన పసుపు-నారింజ రంగుతో కూడిన నర్సు షార్క్ ను కనుగొన్నారు. టోర్టుగ్యురో నేషనల్ పార్క్ నుండి 37 మీటర్ల లోతులో ఒక స్పోర్ట్స్ ఫిషింగ్ యాత్రలో అరుదైన ప్రెడేటర్ కనుగొనబడింది. ఈ షార్క్ అరుదైన వర్ణాన్ని కలిగి ఉండటంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ షార్క్ జాంటిజం అనే అరుదైన పరిస్థితిని కనబరుస్తున్నట్లు గుర్తించారు. ఈ షార్క్ చర్మం, పొలుసులలో బంగారు వర్ణద్రవ్యాలను అధికంగా ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. కొన్ని చేపలలో జాంటిజంను గుర్తించినప్పటికీ, కరేబియన్ షార్క్ లలో దీనిని ఎప్పుడు గుర్తించలేదు. నర్సు షార్క్ లో ఈ రకమైన పద్దతిని గుర్తించడంలో ఇదే తొలిసారి. అయితే, ఈ షార్క్ వయసు నడి వయసును దాటి ఉంటుందని భావిస్తున్నారు.
నిజానికి అల్బినో -క్సాంతోక్రోమిజం షార్క్ ను మరింత అరుదు వర్ణాన్ని కలిగిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. షార్క్ తెల్లటి కళ్ళు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇది అల్బినిజం, క్సాంతోసిస్ అరుదైన కలయిక అయిన అల్బినో-క్సాంతోక్రోమిజమ్ ను కూడా చూపించిందని పరిశోధకులు అంటున్నారు. మెలనిన్ లేకపోవడం వల్ల బంగారు వర్ణద్రవ్యాలు మరింత తీవ్రంగా ప్రకాశించేలా చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి రెండు వర్ణద్రవ్యాలు ఒకేసారి కనిపించి కనువిందు చేస్తున్నట్లు వెల్లడించారు.
Rare bright-orange nurse shark caught in Costa Rica marks first-ever Caribbean case of xanthism.
Follow: @AFpost pic.twitter.com/GuHxX2X0nN
— AF Post (@AFpost) August 19, 2025
Read Also: ఇదెక్కడి వింత రా మామా.. రెన్ బోకు రెడ్ కలర్ ఏంట్రా?
నర్స్ షార్క్ లు ఇప్పటికీ కరేబియన్ దీవుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ చేపలు పట్టడం, వాటి నివావాసాల నాశనం కారణంగా చాలా వరకు అంతరిస్తున్నాయి. అసాధారణ రంగులో కనిపించే తాజాగా షార్క్ జాతులలో జన్యు వైవిధ్యాన్ని నొక్కి చెబుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వాటి ఆవాసాల పరిరక్షణకు ఆయా ప్రభుత్వాలకు కఠిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యల మీద ఆధారపడి వీడి మనుగడ కొనసాగుతుందంటున్నారు. ఈ షార్క్ లకు సంబంధించిన అధ్యయనం గురించి తాజాగా మెరైన్ బయోడైవర్శిటీ జర్నల్ లో ప్రచురించారు.
Read Also: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?