Yogi Adityanath Biopic Issue: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ బయోపిక్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సార్ బోర్డు తిరస్కరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో మూవీ టీం ముంబై కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా యూపీ సీఎం ఆదిత్యనాధ్ జీవితత కథ ఆధారంగా రూపొందిన సినిమా అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
సెన్సార్ బోర్డు అభ్యంతరం
ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(Censor) బోర్డుకు పంపించింది. అయితే ఈ చిత్రం చూసిన బోర్డు సభ్యులు ఈ బయోపిక్ని రిజెక్ట్ చేశారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో మూవీ టీం సెన్సార్ బోర్డును సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించిన సెన్సార్ను తప్పుబడుతూ మూవీ టీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్ర బృందం పిటిషన్ను స్వీకరించిన బోర్డు.. సెన్సార్ను ప్రశ్నించింది. ఈ సినిమా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణాలన వెల్లడించాలని ఆదేశించించింది.
ఆ నవల ఆధారంగా బయోపిక్
అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు మూవీ టీం తమ పిటిషన్లో పేర్కొంది. ఇదే అంశంపై న్యాయస్థానం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఏం ఉందని అడ్డుచెప్పారని నిలదీస్తూ సినిమాకు విడుదలకు అడ్డు చెప్పడానికి గలకారణాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సీబీఎఫ్సీ(CBFC)ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై సెన్సార్ హైకోర్టు ఎలాంటి వివరణ ఇవ్వనుందనే ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి పేరుతో తెరకెక్కిన ఈ బయోపిక్ని దర్శకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాత్రలో ఆనంత్ జోషి నటించగా.. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు.
బోర్డు వివరణకు హైకోర్టు ఆదేశం
కాగా ఆదిత్య నాథ్ జీవిత కథ ఆధారంగా శంతను గుప్తా అనే రచయిత ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ పేరుతో పుస్తకం రాశారు. ఇప్పుడు దీని ఆధారంగానే రవీంద్ర గౌతమ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్ లాల్ యాదవ్, అజయ్ మెంగి, పవర్ మల్హోత్రా, రాజేష్ ఖట్టర్, గరిమా విక్రాంత్ సింగ్, సర్వర్ అహుజా వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజ్ సిగ్ బిష్త్. ఈ పేరు ఆధారంగానే ఈ సినిమా టైటిల్ని పెట్టారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ విడుదలను సెన్సార్ అడ్డుకట్ట వేయడం మూవీ టీంకి షాకిచ్చింది.