BigTV English

War 2: బజ్ ఉన్న సీన్స్ నే కట్ చేసారే.. ఫలితంపై దెబ్బ పడనుందా?

War 2: బజ్ ఉన్న సీన్స్ నే కట్ చేసారే.. ఫలితంపై దెబ్బ పడనుందా?

War 2: ఆగస్టు 14వ తేదీన హిందీ తో పాటూ తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ కాబోతున్న చిత్రం వార్ 2 (War 2). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.


టీమ్ కి షాక్ ఇచ్చిన సెన్సార్..

దీనికి తోడు సినిమా నుండి ట్రైలర్, టీజర్, పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా నుండి ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమోని కూడా విడుదల చేసారు. ఇదిలా ఉండగా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. అయితే ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుండి కొన్ని సన్నివేశాలను సెన్సార్ బోర్డు కట్ చేసినట్లు సమాచారం.


వార్ 2 సినిమా నుండీ ఆ సీన్స్ కట్ చేసిన సెన్సార్..

అసలు విషయంలోకి వెళ్తే.. వార్ 2 కి కియారా అద్వానీ గెటప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది అని ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ లో ఆమె లుక్ నిరూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్లనే సెన్సార్ బోర్డు కట్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో కియారా బికినీ ధరించిన సీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీన్లనే సెన్సార్ బోర్డు సినిమా నుండి తొలగించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంత నిడివి తొలగించారనే విషయంపై క్లారిటీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే.. సినిమా పైన హైప్ పెరగడానికి ఈ సీన్స్ కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు వీటినే తొలగించారు అంటూ వార్తలు వస్తున్నాయి. అటు కూలీ కంటే కూడా ఈ సినిమాకి బజ్ తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో సినిమాపై అంచనాలు పెంచేసిన సీన్లను కూడా తొలగించారని తెలియడంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వార్ 2 సినిమా విశేషాలు…

వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదలరోజే అటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ పోస్టర్ అటు లోకేష్ కనగరాజ్ సినిమాల హిస్టరీ , ఇటు స్టార్ తారాగణం అన్నీ కూడా సినిమాపై హైప్ పెంచేశాయి. మరి ఇలాంటి సంఘటనల మధ్య వార్ 2 సినిమా ఫలితంపై దెబ్బ పడుతుందేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం.

ALSO READ:Upsana: మాది అలాంటి ప్రేమ కాదు – ఉపాసన

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×