BigTV English

Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?

Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?

Udaipur files: కొన్ని సినిమాలు నిజ జీవితం ఆధారంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తాయి.అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. జయంత్ సిన్హ (Jayanth Sinha), భరత్ ఎస్ శ్రీనాథ్(Bharath S Shrinate) దర్శకత్వంలో అమిత్ జానీ (Amit Jani) నిర్మించిన చిత్రం ఉదయ్ పూర్ ఫైల్స్. ఎన్నో వివాదాలు, కోర్టు తీర్పుల మధ్య ఈ మూవీ ఆగస్టు 8న థియేటర్లలోకి వచ్చింది.


అయితే ఈ సినిమా వీకెండ్ లోనే విడుదలైనప్పటికీ రిజల్ట్ మాత్రం రాలేదు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. ఈ సినిమాకి మొదటిరోజు దాదాపు రూ.25 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఎన్నో వివాదాలతో విడుదలైన ఈ సినిమా అసలు స్టోరీ ఏంటి..? ఎందుకు డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుందనేది? ఇప్పుడు తెలుసుకుందాం..

వివాదాల నడుమ ఉదయ్ పూర్ ఫైల్స్ మూవీ..


రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని కన్హయ్య లాల్ (Kanhayya Lal)అనే టైలర్ ను ఇద్దరు ముస్లింలు వ్యక్తులు హత్య చేసిన రియల్ స్టోరీను తీసుకొని దర్శక నిర్మాతలు ఉదయ్ పూర్ ఫైల్స్(Udaipur Files) పేరుతో ఈ సినిమాని విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలామంది వ్యతిరేకించారు. ఈయన నిజ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాధితుడి కుటుంబ సభ్యులు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది.అలాగే ఈ సినిమా సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, మానసిక వేదనకు కారణం అవుతుందని బాధితుడి కుటుంబ సభ్యులు అన్నారట.

సుప్రీంకోర్టు వరకు వెళ్లిన పంచాయితీ..

ఇక నిజ జీవితంలో నిందితులుగా ఉన్న వ్యక్తి ఈ సినిమా విడుదల అయితే కోర్టు తీర్పు నిష్పక్షపాతంగా రాదని ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు.అంతేకాదు ఈ సినిమాపై కేసు వేసి హైకోర్టు వరకు తీసుకెళ్లారు. కానీ చివరికి నిర్మాతలు ఈ కేసుని వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దీనికి తోడు అటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా వివాదాలు తగ్గించడం కోసం 150 సీన్లు కట్ చేసింది.

ఎట్టకేలకు ఆగస్టు 8న థియేటర్లలోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్..

అయితే ఈ సినిమా విడుదలకి ముందు స్టే విధించడం పై నిర్మాత సుప్రీంకోర్టు ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిజ జీవిత సంఘటనల గురించి సినిమాలు తీయడం చట్ట విరుద్ధం ఏమీ కాదని తీర్పు కూడా ఇచ్చి స్టేని ఎత్తివేసింది. దాంతో ఈ సినిమా సోషల్ మీడియా, మెయిన్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఈ సినిమా విడుదలకు ఇదే కరెక్ట్ టైం అని చిత్ర యూనిట్ ఉదయ్ పూర్ ఫైల్స్ మూవీని ఆగస్టు 8న విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో ఏర్పడిన వివాదం సినిమాకి మరింత ప్లస్ అవుతుందని భావించినప్పటికీ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు.

రాంగ్ టైంలో రిలీజ్ చేసిన నిర్మాతలు..

దీంతో ఈ సినిమా డిజాస్టర్ అనే టాక్ బీ టౌన్ లో వినిపిస్తోంది. అలాగే ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమాని రాంగ్ టైంలో విడుదల చేశారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్లో సైయారా (Saiyaara) మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. అంతేకాకుండా ధడక్ -2 , సన్ ఆఫ్ సర్దార్ 2(Son Of Sardar-2 )వంటి రెండు సినిమాలు కూడా ఇంకా థియేటర్లోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమాని విడుదల చేసి తప్పు చేశారని అంటున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో కూలీ (Coolie), వార్ -2(War-2)వంటి రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమా డిజాస్టర్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు సినిమాకి వివాదం ఒక్కటే కలిసి వస్తుందని ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ సినిమా ప్రజలకు రీచ్ అవ్వలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి
ఏది ఏమైనప్పటికి నిర్మాతలు, థియేటర్లో ఉన్న సినిమాలను దృష్టిలో పెట్టుకొని సరైన రిలీజ్ డేట్ ని ఎంచుకుంటే బాగుండేదని కూడా అంటున్నారు.

also read:Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×