BigTV English

Upcoming Movies in Theater : సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

Upcoming Movies in Theater : సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
Advertisement

Upcoming Movies in Theater : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. కొన్ని సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన సరే.. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ టాక్ ను సంపాదించుకోలేక పోతున్నాయి. ఈమధ్య విడుదలైన సినిమాలు అన్నీ కూడా దాదాపు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఈమధ్య భారీ సినిమాలో రిలీజ్ అవుతున్న సరే పెద్దగా ఆకట్టుకోవడం లేదు.. బడ్జెట్ పెట్టిన చిత్రాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఆగస్టు నెలలో వచ్చిన సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో అందరూ సెప్టెంబర్ లో రాబోతున్న సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఈ సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సెప్టెంబర్ నెలలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు..

అనుష్క – ఘాటీ.. 


సెన్సిబుల్ కథలతో ఆకట్టుకొనే దర్శకుడు క్రిష్. ఆయన ఈసారి అనుష్కని `ఘాటీ`గా చూపించబోతున్నారు.. టాలీవుడ్ జేజమ్మ సినిమాల్లో చూసి చాలా కాలమే అయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీలో అనుష్క గిరిజన యువతి పాత్రలో నటిస్తుంది. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. పైగా టీజర్, ట్రైలర్ లో చూపించిన యాక్షన్ అదిరింది. అనుష్కని ఇలా చూడడం, క్రిష్ ఈ తరహా సినిమాలు చేయడం పూర్తిగా కొత్త.. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలకి అనుష్క దూరంగా ఉన్నా సరే పెద్దగా ఆలోచించకుండా టీం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. మొత్తానికి ఈ మూవీ సెప్టెంబర్ 5 న రాబోతుంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

శివకార్తికేయన్ – మదరాసి.. 

గత ఏడాది అమరన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్ ఈ ఏడాది మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. ఈయన నటించిన మూవీ మదరాసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 5 న ఈ మూవీ రాబోతుంది. ఈసారి మురుగదాస్ హిట్ కొట్టాల్సిన అత్యవసర పరిస్థితులలో ఉన్నాడు. మరోవైపు శివ కార్తికేయన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ హిట్ కొడుతుందేమో చూడాలి..

లిటిల్ హార్ట్స్.. 

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ రూపొందించిన ఈ చిత్రం ఓ టీనేజ్ లవ్ స్టోరీ. మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ చాలా ఫన్నీగా వుంది. నిజానికి ఓటీటీ కోసమే తీసిన సినిమా ఇది. అవుట్ పుట్ చూసిన తర్వాత థియేటర్ లో విడుదల చేయాలని ఫిక్సయ్యారు. ఆ కంటెంట్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం.. ఇప్పటివరకు మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో చూడాలి..

టైగర్ శ్రాఫ్- బాఘీ 4…

టైగర్ శ్రాఫ్, హర్నాజ్ సంధు జంటగా నటించిన భారీ యాక్షన్ సినిమా. ఏ.హర్ష దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ నెలలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

చిన్ని- లవ్ యూ రా..

చిన్ని, గీతికా రతన్ నటించిన న్యూ ఏజ్ లవ్ డ్రామా. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు.. ఈ మూవీ కూడా ఇదే నెలలో థియేటర్లలోకి రాబోతుంది.

వివేక్ అగ్నిహోత్రి – ది బెంగాల్ ఫైల్స్..

బాలీవుడ్ హీరో వి వేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి నటించిన చిత్రం. సమాజంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది…

పవన్ కళ్యాణ్ – ఓజీ.. 

పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ఓజీ.. పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం హరిహర వీరమల్లు ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఈ మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది.

వీటితో పాటుగా మరికొన్ని చిత్రాలు సడెన్ గా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరి వీటిలో ఏ మూవీ బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×