BigTV English

Vijay- Rashmika : విజయ్, రష్మిక హ్యాట్రిక్ మూవీ షూటింగ్ నేటి నుంచే స్టార్ట్… మొత్తం స్టోరీ ఇదే

Vijay- Rashmika : విజయ్, రష్మిక హ్యాట్రిక్ మూవీ షూటింగ్ నేటి నుంచే స్టార్ట్… మొత్తం స్టోరీ ఇదే

Vijay- Rashmika : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు రూమర్డ్ లవర్స్ గా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna). ప్రముఖ డైరెక్టర్ పరుశురాం (Parushuram) దర్శకత్వంలో 2018లో హాస్య ప్రేమ కథ చిత్రం గా విడుదలైంది.అదే గీతాగోవిందం. ఈ సినిమాలో విజయ్ , రష్మిక జంటగా కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నిజ జీవితంలో పెళ్లి చేసుకుంటేఇంత అద్భుతంగా ఉంటుందా? అనిపించేలా తమ నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ జంట. 2018లో విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుని.. అటు వీరిద్దరికీ కూడా మంచి గుర్తింపును అందించింది.


హ్యాట్రిక్ మూవీతో రాబోతున్న విజయ్ దేవరకొండ – రష్మిక ..

ఈ సినిమా తర్వాతనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు. దీనికి తోడు ఎక్కడపడితే అక్కడ కలిసి కనిపించడం, వెకేషన్ లకు వెళ్లడం, తరచూ విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక కనిపించడం ఇలా పలు కారణాలు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందనడానికి బలమైన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ జంట. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ జానర్లో సినిమా రాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.


లాంఛనంగా షూటింగ్ ప్రారంభం..

ఈరోజు లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉన్నప్పటికీ.. షూటింగ్ మాత్రం విజయనగరంలో జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిందని, ఈరోజు రెండవ షెడ్యూల్ కూడా మొదలైందని సమాచారం. ఈ సినిమా పూర్తయ్యాక దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘ రౌడీ జనార్దన్’ సినిమాకి విజయ్ దేవరకొండ డేట్స్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. మరి మూడవ సినిమాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలి అని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక సినిమాలు..

రష్మిక సినిమాల విషయానికి వస్తే మొన్నటి వరకు వరుసగా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె ఇప్పుడు తన జానర్ ను పూర్తిగా మార్చేసింది. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాలతో పాటు థామా, కాంచన 4 వంటి హార్రర్ చిత్రాలలో కూడా నటిస్తోంది.

ALSO READ:Tasty Teja: వేలం పాటలో గణేష్ లడ్డు సొంతం చేసుకున్న టేస్టీ తేజ.. ఖరీదు ఎంతో తెలుసా?

Related News

Lokesh Kanagaraj: సక్సెస్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు రావడం కాదు, కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ ఫస్ట్ ఇంటర్వ్యూ

Rama Naidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్ లో దారుణం.. ప్రొఫెసర్ కు తప్పని వేధింపులు!

Usthad Bhagath Singh : బద్రి వైబ్… పవర్ స్టార్ ను ఎలా చూపించాలో హరీష్ కు తెలుసు

Upcoming Movies in Theater : సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

Teja Sajja: కల్కి 2 లో ఆ పాత్రలో చాన్స్ కొట్టేసిన తేజ సజ్జ… ఇక తిరుగుండదుగా?

Big Stories

×