E-Paper
Advertisement

రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!

రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరి వీడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

రాంచందర్ రావు మాట్లాడుతూ..

Advertisement

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని అనడం పూర్తి అవాస్తవమని ఖండించారు. 2017 జనవరి 4న తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, విద్యావ్యవస్థ దుస్థితిపై గళమెత్తిన అంశాలు అసెంబ్లీ, మండలి రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బకాయిల సమస్య కొనసాగుతూనే ఉందని రాంచందర్ రావు పేర్కొన్నారు.

రూ. 15 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు..?

Advertisement

బీఆర్ఎస్ తమ పదేళ్ల పాలనలో మొదటి ఎనిమిదేళ్లు నిధులు ఇచ్చి, చివరి రెండేళ్లలో దాదాపు రూ. 5 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే స్వయంగా బీఆర్ఎస్ నుంచి రూ. 5,430 కోట్ల బకాయిలు వచ్చాయని చెప్పిందని, 2024-25 నాటికి కాంగ్రెస్ హయాంలోనే మరో రూ. 6,037 కోట్ల బకాయిలు పెరిగాయని ప్రభుత్వమే వెల్లడించిందని వివరించారు. నేడు 2026 నాటికి పాత, కొత్త బకాయిలు అన్నీ కలిసి సుమారు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ సర్కార్ పై రాంచందర్ రావు ఆగ్రహం

విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేసే డీబీటీ విధానానికి బీజేపీ ఏనాడూ వ్యతిరేకం కాదని, మేనేజ్‌మెంట్లతో తమకు సంబంధం లేదని, విద్యార్థుల ఖాతాల్లో ఆ సొమ్మును ఎప్పుడు జమ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. బకాయిలు చెల్లించకపోవడం వల్లే అనేక కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగినా, కాంగ్రెస్ హయాంలో జరిగినా సమగ్ర విచారణ జరపాలని, కానీ విజిలెన్స్ దాడుల పేరుతో కాలేజీలను వేధించడం సరికాదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ సర్కార్ అంధకారంలోకి నెడుతోందని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో 97తో పాలిటెక్నిక్ విద్య నాశనం..?

జీవో 97 ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేసి, పాలిటెక్నిక్ డిగ్రీనే పూర్తిగా ఎత్తేసే కుట్ర జరుగుతోందని, వారికి ఈ-సెట్ రాసే అర్హత ఉంటుందో లేదో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులతో క్రూరంగా లాఠీచార్జ్‌లు చేయించడం అమానుషమన్నారు. ఇదిలాఉండగా బీజేపీలో పలువురు నాయకులు చేరారు. ఇటీవలే సర్వీస్ నుంచి రిటైర్ అయిన డీసీపీ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, పెద్దసంఖ్యలో యువకులు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా వారికి పార్టీ కండువాలు కప్పి రాంచందర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

Tags

Related News

నన్ను రెచ్చగొడితే కథ వేరేలా ఉంటుంది.. ప్రత్యర్థులకు కొండా మురళి వార్నింగ్!

ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

Big Stories

Advertisement
×