E-Paper
Advertisement

గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!

గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!
Advertisement

Google Drive: మనలో చాలామందికి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ ఇలా ముఖ్యమైన ఫైల్స్‌ను సేఫ్‌గా స్టోర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ బెస్ట్ ఆప్షన్. ఫోన్ లేదా కంప్యూటర్‌లో స్టోరేజ్ సమస్య వచ్చినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫైల్స్‌ను డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసే సమయంలో మాత్రం కొన్నిసార్లు అనుకున్నంత వేగంగా పని చేయదు. ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా.. ఒక చిన్న ఫైల్ కూడా అప్లోడ్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ కనెక్షన్ సరి చూసుకోవాలి:

మొదట వైఫై రూటర్‌ను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. చాలా రోజుల నుంచి రూటర్ ఆఫ్ చేయకపోతే స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇంట్లో వేరే వాళ్లు ఎవరైనా హెవీగా వీడియోలు చూస్తున్నా లేదా గేమింగ్ ఆడుతున్నా బ్యాండ్‌విడ్త్ తగ్గి డ్రైవ్ స్పీడ్ స్లో అవుతుంది. వీలైతే లాన్ కేబుల్ కనెక్ట్ చేయడం మంచిది. ఫోన్ అయితే మొబైల్ డేటా మార్చి ట్రై చేయండి.

Advertisement

Also Read: కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

ఫోన్ రీస్టార్ట్ చేయడం:

కొన్నిసార్లు మనం వాడే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ సరిగ్గా పనిచేయనప్పుడు కూడా అప్లోడ్ స్పీడ్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు డివైస్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయాలి. అలాగే ఫోన్‌లో బ్యాటరీ సేవర్, డేటా సేవర్ ఆన్‌లో ఉన్నాయేమో చూసి వాటిని ఆఫ్ చేయాలి. ఇవి ఆన్‌లో ఉంటే నెట్ స్పీడ్ ఆటోమేటిక్‌గా పరిమితం అవుతుంది. బ్రౌజర్ క్యాష్ క్లియర్ చేయడం కూడా మంచిది.

గూగుల్ డ్రైవ్ స్టేటస్ చూడాలి:

Advertisement

కొన్నిసార్లు గూగుల్ సర్వర్లలో ప్రాబ్లం ఉండటం వల్ల కూడా ఫైల్స్ స్లోగా అప్లోడ్ అవుతుంటాయి. గూగుల్ వర్క్‌స్పేస్ స్టేటస్ డ్యాష్‌బోర్డ్ ఓపెన్ చేసి డ్రైవ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. అలాగే మీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ పూర్తిగా నిండిపోయిందేమో చూడండి. రోజుకి గూగుల్ 750 జీబీ వరకు మాత్రమే అప్లోడ్ పరిమితి ఇస్తుంది. ఆ లిమిట్ దాటినా అప్లోడ్ అవ్వదు.

చిన్న బ్యాచ్‌లుగా అప్లోడ్ చేయడం:

అన్ని ట్రిక్స్ ట్రై చేసినా స్పీడ్ పెరగకపోతే.. పెద్ద పెద్ద ఫైల్స్‌ను ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా అప్లోడ్ చేయండి. ఉదా: వంద ఫొటోలు ఉంటే వాటిని ఇరవై చొప్పున విడదీసి అప్లోడ్ చేయండి. యాప్ కంటే వెబ్ బ్రౌజర్ వాడటం వల్ల కొన్నిసార్లు మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే గూగుల్ డ్రైవ్ స్లో అనే సమస్యే ఉండదు.

Also Read: పెద్ద కెమెరా సెన్సార్, 5000mAh బ్యాటరీతో Sony Xperia 1 IX!

Tags

Related News

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా?

యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?

కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

Big Stories

Advertisement
×