BigTV English

Dhanush: ప్రభాస్ హీరోయిన్ తో ధనుష్ ఘాటైన లిప్ కిస్.. థియేటర్లు బద్దలవ్వడం ఖాయం

Dhanush: ప్రభాస్ హీరోయిన్ తో ధనుష్ ఘాటైన లిప్ కిస్.. థియేటర్లు బద్దలవ్వడం ఖాయం

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీలో కూడా ధనుష్ సినిమాలను చేస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే తెలుగులో కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సార్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ధనుష్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుబేరతో మరో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నాలుగో సారి 100 కోట్ల క్లబ్ లో  చేరాడు.


 

ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ హిందీలో ఒక సినిమా చేస్తున్నాడు అదే తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో రాంఝనా అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆయా తరువాతా హిందీలో పలు సినిమాలు చేసిన ధనుష్ చాలా కాలం తరువాత ఆనంద్ ఎల్ రాయ్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 

ఇక ఈ చిత్రంలో ధనుష్ , కృతి సనన్ మధ్య ఘాటైన లిప్ లాక్ ఉండబోతుందని తెలుస్తోంది. సాధారణంగా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలు అంటే ఎంత క్లీన్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువ ఉండని సినిమాలు. అలాంటిది ఈ సినిమాలో ఘాటైన లిప్ కిస్ ఉంది అంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే కథ బాగా డిమాండ్ చేయడంతోనే లిప్ కిస్ సీన్ ను యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆనంద్ ఎల్ రాయ్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేసాయి.

 

శంకర్ అనే యువకుడి పాత్రలో ధనుష్ నటిస్తుండగా.. ముక్తి అనే యువతిగా కృతి సనన్ నటిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా ధనుష్ రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. యాక్షన్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను ఎంచుకుని భారీ విజయాలను అందుకుంటున్నాడు. ఎంత లవ్ స్టోరీస్ తీసినా కూడా అందులో ఇలాంటి ముద్దు సీన్స్ కు ధనుష్ ప్రాధాన్యత ఇవ్వడం మానేశాడు. కానీ, ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఓకే చెప్పడంతో ధనుష్ కూడా కాదనలేకపోయాడని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ ఘాటు ముద్దు సీన్ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

Related News

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Tollywood cineworkers: ముగిసిన సినీ కార్మికుల సమ్మె, కాసేపట్లో ప్రెస్ మీట్

Mega 157 Glimpse: మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, టీజర్ అదిరింది. అసలైన మెగా ట్రీట్

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Big Stories

×