E-Paper
Advertisement

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?
Advertisement

Govinda Komal:గోవిందా..ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన ఈ క్రేజీ స్టార్ ఇపుడు వివాదాలతో మీడియాలో హైలెట్ అవుతున్నాడు.విషయంలోకి వెళ్తే గోవిందా భార్య సునీత అహుజాతో విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొట్టాయి కూడా. అయితే కారణాలు ఏవైనప్పటికీ ఆ వార్తలు వార్తల్లాగే మిగిలిపోయాయి.

కోమల్ రాణి తో లివింగ్ రిలేషన్ షిప్

Advertisement

అయితే తాజాగా గోవిందా,కోమల్ రాణి తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.ఇంతకీ ఈ కోమల్ రాణి ఏవరనుకుంటున్నారా..ప్రస్తుతం గోవిందా నటిస్తున్న రూపా సినిమాలో నటిస్తుంది ఈ భామనే.ఇక వీరిద్దరూ ప్రస్తుతం ఎయిర్ పోర్టు,కాఫీ షాపు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడే కలిసి కనిపిస్తుండటంతో వీరిద్దరి మధ్య బంధం మరింత బలంగా మారింది అన్న చర్చలు మొదలయిపోయాయి.

ఇక మరి కొందరైతే ఏకంగా ఇద్దరూసీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కూడా .అయితే ఈ విషయాన్ని గోవిందా కానీ, కోమల్ కానీ ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి వారు చెప్పేదాకా వీటిని రూమర్స్ గానే చూడాలి.

Advertisement

వినాయక చవితి సందర్భంగా

ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ మరోసారి వినాయక చవితి సందర్భంగా ముంబైలోని లాల్‌బాగ్చా గణపతినికలిసి దర్శించుకున్నారు. గోవిందా సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా.. కోమల్ కూడా చీరలో సాంప్రదాయంగా కనిపించింది. ఇక వీరిద్దరూ కలిసి పూజ చేయడంతో మరోసారి ఈ జంట వార్తల్లోకి వచ్చింది.

అయితే అసలు హాట్ టాపిక్ మాత్రం కోమల్ నుదుటిపై కనిపించిన సింధూరం అనే చెప్పాలి. గుడిలోకి వెళ్లే సమయంలో ఆమె నుదుటిపై సింధూరం కనిపించలేదని.. పూజ పూర్తయ్యాక బయటకు వచ్చినప్పుడు మాత్రం సింధూరం కనిపించిందని,దీంతో ‘ఏంటి.. గోవిందా, కోమల్ పెళ్లి చేసుకున్నారా?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వర్షం కురిపించారు నెటిజన్లు. అయితే గణపతి పూజ సమయంలో అక్కడ ఉన్న కుంకుమ కోమల్ నుదుటికి అంటుకుని ఉండొచ్చని మరికొంతమంది ఈ జోడీకి సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు.

కెరీర్ విషయానికి వస్తే

గోవిందా కెరీర్ విషయానికి వస్తే 90ల్లో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ హీరో కి కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్టింగ్‌తో అప్పట్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ‘కూలీ నంబర్ 1’, ‘హీరో నంబర్ 1’, ‘రాజా బాబు’ వంటి సినిమాలు గోవిందాకు మంచి స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు మంచి క్రేజ్ ఉండేది.

also read :నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

1987లో సునీత అహుజాను గోవిందా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా ఏళ్లుగా కలిసి ఉంటున్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. సునీత కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో గోవిందా గురించి చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.చూడాలి మరి ఆగుతూ ఆగుతూ సాగుతున్న ఈ వ్యవహారం ఎప్పుడు శుభం కార్డ్ వేసుకుంటుందో !

Tags

Related News

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!

తరుణ్‌కు భారీ హిట్.. ఏవీఎస్‌కు మరో టెన్షన్! ‘అంకుల్’ వెనుక కథ ఇదేనా?

Big Stories

Advertisement
×