E-Paper
Advertisement

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్
Advertisement

Khushi Kapoor:అతిలోకసుందరి శ్రీదేవి కి జాన్వీ కపూర్ ,ఖుషీ కపూర్ అని ఇద్దరు కూతుళ్ళు ఉన్న సంగతి తెల్సిందే.అయితే వీళ్ళలో జాన్వీ కపూర్ వరుస సినిమాలతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా చెల్లెలు ఖుషీ కపూర్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ రాబట్టలేక సతమతమైపోతుంది.

అయితేనేం సినిమాలలో కాస్త స్లో అయినా సోషల్ మీడియాలో నా స్పీడ్ ఎవరూ అందుకోలేరు అంటూ వరుస పోస్టులతో నెట్టింటిని షేక్ చేస్తూనే ఉంటుంది.ఇదిగో ఆ క్రమంలోనే ఈ బీ టౌన్ ముద్దుగుమ్మ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

నిజంగానే ఫెయిరీ ప్రిన్సెస్‌

ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఖుషీ.. “Living my fairy princess dream In my favourite @manishmalhotraworld @manishmalhotra05” అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే తనకు నచ్చిన మనీష్ మల్హోత్రా డిజైన్‌లో ఫెయిరీ ప్రిన్సెస్‌లా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చిందన్న మాట.సాఫ్ట్ పింక్ కలర్ డ్రెస్‌లో ఖుషీ అదిరిపోవడంతో ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా.. నిజంగానే ఫెయిరీ ప్రిన్సెస్‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

లుక్ మాత్రం చాలా క్లాసీ

నిజానికి ఖుషీ వేసుకున్న ఈ పింక్ డ్రెస్ చాలా సింపుల్‌గా ఉన్నా.. లుక్ మాత్రం చాలా క్లాసీగా ఉంది. డ్రెస్‌కి ఉన్న డిజైన్, దానికి జతగా వేసుకున్న ఫ్యాబ్రిక్, హెయిర్ స్టైల్, లైట్ మేకప్ అన్నీ కలిపి ఆమెకు మంచి లుక్ ఇచ్చాయనే చెప్పాలి. పెద్దగా హంగామా లేకుండా చిన్న ఇయర్‌రింగ్స్, రింగ్స్‌తోనే ఫాలోవర్స్ ని ఫిదా చేసేసింది.

సినిమాల విషయానికి వస్తే

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఖుషీ కపూర్ 2023లో వచ్చిన ‘ది ఆర్చీస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఖుషీ బెట్టీ కూపర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సుహానా ఖాన్, అగస్త్య నందా, వేదాంగ్ రైనా కూడా నటించడం విశేషం.

ఆ తర్వాత ఖుషీ కపూర్‘లవ్‌యాపా’ సినిమాలో జునైద్ ఖాన్‌తో కలిసి నటించింది. ప్రేమ, రిలేషన్‌షిప్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో బాని శర్మ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి ‘నాదానియాన్’ సినిమాలో నటించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

టాలీవుడ్ బాట ఎప్పుడు పడుతుందో 

ఇలా వరుస సినిమాలతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఖుషీ.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా తన ఫొటోషూట్స్, ఫ్యాషన్ లుక్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

ఇప్పుడు మనీష్ మల్హోత్రా డిజైన్‌లో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు కూడా అదే విధంగా వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కలాగా టాలీవుడ్ బాట ఎప్పుడు పడుతుందో !

Tags

Related News

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!

Big Stories

Advertisement
×