Tollywood Industry : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర కన్నుమూశారు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ చనిపోయారు అన్న వార్త విని సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన మరణ వార్త విని నివాళులు అర్పిస్తున్నారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.. హైదరాబాదులోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన డైరెక్టర్ చనిపోవడంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తూ నివాళులర్పిస్తున్నారు. ఒక లెజెండ్రీ డైరెక్టర్ ని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం అంటూ ఆయనతో పని చేసిన నటీనటులు అలాగే డైరెక్టర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు భారీ స్థాయిలో జరగనున్నాయని సమాచారం. మహాప్రస్థానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
ఎస్.ఎస్.రవిచంద్ర ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలోని తెరకెక్కించిన ఘనత ఆయనకు ఉంది. అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారని తెలిసింది. అప్పట్లోనే సీనియర్ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్‌గా పనిచేశారు. మొదట తెలుగు లో కాకుండా హిందీ సినిమా అయిన ‘ఖైదీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలకు తెరకెక్కించే అవకాశాన్ని అందుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.. గత కొద్దిరోజులుగా వయోభారం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఒకవైపు చికిత్స తీసుకుంటున్న కూడా మరోవైపు సమస్యల మీద సమస్యలు ఆయనను వెంటాడడంతో చివరికి తుది శ్వాస విడిచారు. ఎన్నో హిట్ సినిమాలు కు పనిచేసిన ఆయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది..
మొదట హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా తెలుగులో హీరో కృష్ణ గారితో మొదటి చిత్రాన్ని తెరకెక్కించారు. రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. కృష్ణతోనే కాకుండా ఆనాటి అగ్ర హీరోలతో రవిచంద్ర ఎన్నో హిట్ లను తెరకెక్కించారు.. అదే విధంగా బాలయ్యతో కూడా ఎన్నో సినిమాలను తెరకేక్కించి సక్సెస్ ని అందుకున్నారు.. ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, విక్టరీ వెంకటేష్ తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు హిందీలో కూడా పలు సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు లేరు అన్న వార్త చాలామందికి తీవ్రత విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ నటులు డైరెక్టర్లు ఎంతోమంది చనిపోయి అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీకి తీరని లోటునే చెప్పాలి..