Chiranjeevi Wishes Nani:ఎన్నో నెలలుగా ఊరించిన ప్యారడైజ్ సినిమా ఎట్టకేలకి థియేటర్ లలో అడుగుపెట్టబోతుంది.ఈ సందర్భంగా సినిమా యూనిట్ గా విషెస్ ల వర్షం కురిపిస్తున్నారు సినీ సెలెబ్రిటీలు .ఈ క్రమంలోనే నానికి తన విషెస్ అందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మెగా స్టార్ చిరంజీవి. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. చిరంజీవి పోస్ట్‌తో ఆ హైప్ మరింత పెరిగిందనే చెప్పాలి.
‘ది ప్యారడైజ్’ తో మరోసారి
నాని అంటే ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే హీరో అని చెప్పక్కర్లేదు.‘అష్టా చమ్మా’ నుంచి ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వరకు ఒక్కో సినిమాతో తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.ఆ క్రమంలోనే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తో మరోసారి ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపోయాడు.
ఆసక్తికరంగా ఉందన్న చిరు
ఇక చిరంజీవి తన ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ని చూస్తే నాని చూపించే ఉత్సాహం, నిజాయితీ, కొత్త విషయాలను ప్రయత్నించాలనే తపన తనకు ఎప్పుడూ నచ్చుతుందని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ‘దసరా’ సినిమా సమయంలో నాని, శ్రీకాంత్ ఓదెల చూపించిన ప్యాషన్, కథపై నమ్మకాన్ని తాను గమనించానని.. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని ‘ది ప్యారడైజ్’ ద్వారా చూపించబోతుండటం ఆసక్తికరంగా ఉందని తన అభిప్రాయాన్ని తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్
‘ది ప్యారడైజ్’ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతూ నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు నిర్మాతలు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, మొత్తం చిత్రబృందానికి చిరంజీవి తన బెస్ట్ విషెస్ అందించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టించాలని, ఈ సినిమాకి పని చేసిన అందరికీ ఈ ప్యారడైజ్ ఒక మరపురాని సినిమాగా నిలిచిపోవాలని కోరుకున్నారు.
‘దసరా’ నాని కెరీర్‌లోనే కాకుండా శ్రీకాంత్ ఓదెలకు కూడా ఒక మెమరబుల్ సినిమాగా నిలిచిందనే చెప్పాలి. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ, మాస్ ఎమోషన్స్, రా టేకింగ్‌తో ఆ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాని లుక్, పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే కాంబినేషన్ ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ కోసం జత కట్టడంతో ఇపుడు అంచనాలు స్కై లెవెల్ కి వెళ్ళిపోయాయి.
బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ఇక చిరంజీవి చిన్న హీరోలకి ఇలా విషెస్ చెప్పడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎందఱో యంగ్ హీరోలు, దర్శకులను ఆయన అభినందించిన వారే. ఇప్పుడు నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు.చూడాలి మరి భారీ అంచనాలు మోస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new.
After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world…
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 23, 2026