Ram Gopal Varma: కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR ) హీరోగా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతూ చేసిన చిత్రం దేవర. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కాలక్రమేనా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకొని.. 600 కోట్లకు క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది.
ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఒకవైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. మరొకవైపు ఏఐ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది ఆకతాయిలు దేవర సినిమాలోని “చుట్టమల్లే” సాంగును మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం సంచలనంగా మారింది. దీనిపై ఎన్టీఆర్, జాన్వీ కపూర్ , విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రామ్ పోతినేని(Ram Pothineni), చిరంజీవి (Chiranjeevi) లాంటి భారీతారాగణం ఒక్కొక్కరిగా స్పందిస్తూ.. మార్ఫింగ్ వీడియో చేస్తున్న బ్యాచ్ పై తమదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
సెలబ్రిటీలు ఈ మార్ఫింగ్ వీడియోలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటే.. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తనదైన శైలిలో స్పందించి, సెలబ్రిటీలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ విడుదల చేస్తూ.. తప్పంతా సెలబ్రిటీలదే అంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాంగోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా..” సెలబ్రిటీలందరూ తప్పు చేశారు. ఆ అభ్యంతరకరమైన లింకును ప్రచారం చేసి, దీని ద్వారా కోట్లాదిమంది ప్రజలు చూసేలా తమ ట్వీట్స్ తో విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఇలా చేయకుండా మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేసిన ఆ నిందితుడిని పట్టుకోవడం పై దృష్టి సారించి ఉంటే, ఈ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే, తెలివైన పని అనిపించుకునేది. కానీ ట్వీట్ చేసి బాధితురాలు గుర్తింపు పై నేరం పరిగణించబడే ఈ అభ్యంతరకరమైన కంటెంట్ పై విపరీతమైన దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఇది కూడా ఒక నేరమే” అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. దేవర సినిమాలో చుట్టమల్లే సాంగ్ ను కొంతమంది ఏఐ టెక్నాలజీ సహాయంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనిపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాతృదేవోభవ అనే పదం ఒక్కటే కాదు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరు మహిళను గౌరవించాలి. ఇలా ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసిన నీచులను ఎవరిని వదిలిపెట్టను అంటూ ఆయన మండిపడ్డారు. ఇక జాన్వీ కపూర్ , చిరంజీవి లాంటి వారు కూడా దీనిపై స్పందించారు.
The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring…
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026