BigTV English

Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!

Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!

Mega Heroes: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టి తన స్వసక్తితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా చిరంజీవి తర్వాత ఆయన వారసులుగా తన తమ్ములతో పాటు తన కుమారుడు అలాగే అల్లుళ్ళు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కెరియర్ పరంగా అందరూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక మెగా హీరోలకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. మెగా అభిమానులు తమ హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయం తెలిసిన లేదా ఏ చిన్న ఫోటో బయటకు వచ్చిన పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ సందడి చేస్తుంటారు.


జిమ్ లో కష్టపడుతున్న మెగా హీరోలు…

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ముగ్గురు మెగా హీరోలు ఓకే ప్రేమ్ లో కనిపించడం నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తే ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ తో పాటు, రామ్ చరణ్(Ramcharan) సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)ముగ్గురు కూడా జిమ్ లో పెద్ద ఎత్తున చెమటలు చిందిస్తూ ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇలా వర్కౌట్స్ అనంతరం ఈ ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.


పెద్ది పై భారీ అంచనాలు..

ఇలా ఈ ముగ్గురు హీరోలకు సంబంధించిన అభిమానులు ఈ ఫోటోని తిరిగి పోస్ట్ చేస్తూ వారి సినిమాలకు సంబంధించిన హ్యాష్ టాగ్ ను జోడించడంతో తిరిగి పెద్ది సినిమా (Peddi Movie)ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలచేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

షూటింగ్ పనులలో బిజీగా మెగా హీరోలు…

ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇందులో రామ్ చరణ్ కి జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక సాయి దుర్గ తేజ్ విషయానికొస్తే బ్రో సినిమా ద్వారా చివరిగా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం సంబరాల యేటిగట్టు సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇక వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా మట్కా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ ప్రస్తుతం తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ విడుదల కాబోతుందని సమాచారం.

Also Read: Arundhati child Artist: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×