Mobile Document Scanner: కొన్నిసార్లు ముఖ్యమైన పని కోసం డాక్యుమెంట్లు స్కాన్ చేసి వెంటనే పంపించాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు దగ్గర్లోని నెట్ సెంటర్‌కు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫోన్‌లో ప్రత్యేకంగా స్కానర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. సెపరేట్‌గా స్కానర్ మెషిన్ కొనకుండానే.. మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తోనే డాక్యుమెంట్లను చాలా క్లియర్‌గా స్కాన్ చేసి PDFగా సేవ్ చేసుకోవచ్చు.
చాలామందికి ఫోన్‌తో డాక్యుమెంట్లను స్కాన్ చేయొచ్చని తెలిసినా, అందులోని ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలోనే ఇందుకు అవసరమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరి మీ ఫోన్‌ను స్కానర్‌గా ఎలా మార్చుకోవాలి? డాక్యుమెంట్లను స్కాన్ చేసి PDFగా ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే ప్రత్యేకంగా వేరే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లోని Notes యాప్ ఓపెన్ చేసి, అటాచ్‌మెంట్ గుర్తుపై టాప్ చేసి డాక్యుమెంట్లను స్కాన్ చేయవచ్చు. కెమెరా దానంతట అదే పేపర్ అంచులను గుర్తుపట్టి స్కాన్ చేస్తుంది. ఒకవేళ సరిగ్గా రాకపోతే మీరే చేత్తో క్రోప్ చేసుకోవచ్చు. Files యాప్ ద్వారా కూడా నేరుగా డాక్యుమెంట్లను స్కాన్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
Also Read: ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ డ్రైవ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాప్ ఓపెన్ చేసి కెమెరా బటన్ నొక్కి పేపర్‌ను ఫోటో తీస్తే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని క్రాప్ చేయడం, రంగులు మార్చడం లేదా తిప్పడం వంటి మార్పులు చేయవచ్చు. ఒకే ఫైల్‌లో మరిన్ని పేజీలను కూడా జోడించవచ్చు. ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లలో ఒకేసారి అనేక పేజీలను గుర్తించే సరికొత్త ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
మైక్రోసాఫ్ట్ గతంలో లెన్స్ అనే యాప్‌ను అందించేది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన దాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నేరుగా వన్‌డ్రైవ్ యాప్‌లోనే చేర్చారు. దీని ద్వారా స్కాన్ చేసిన డాక్యుమెంట్లు నేరుగా క్లౌడ్‌లోనే సేవ్ అవుతాయి. కాబట్టి.. మీ ఫైల్స్ ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి. ఇంటర్నెట్ లేని సమయంలో లోకల్ కాపీలు కావాలనుకునే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆఫీసు పత్రాలు, బిల్లులు లేదా ఐడీ కార్డులను మరింత ప్రొఫెషనల్‌గా స్కాన్ చేయాలనుకుంటే అడోబ్ స్కాన్ యాప్ ఉపయోగించవచ్చు. ఇది పేపర్‌పై ఉన్న అక్షరాలను స్పష్టంగా గుర్తుపట్టి కాపీ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్ ఫైళ్లను మేనేజ్ చేయడానికి, వాటర్‌మార్కులు తీసేయడానికి ఈ యాప్ చాలా అనుకూలంగా ఉంటుంది.
ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు పేపర్‌ను సరిసమానంగా ఉన్న టేబుల్‌పై ఉంచాలి. వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నీడలు పడకుండా ఫోన్‌ను సరిగ్గా పేపర్ పైన పట్టుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత పేపర్ అంచులు సరిగ్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. బ్లర్ కాకుండా అన్ని అక్షరాలు, సంతకాలు స్పష్టంగా కనిపించినప్పుడే ఫైల్‌ను సేవ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయడం మంచిది.
Also Read: బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!