E-Paper
Advertisement

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!
Advertisement

Indian Railways Rules: దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలునే అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా భావిస్తుంటారు. అయితే ఈ ప్రయాణ సమయంలో రైల్వే నిబంధనలు పాటించకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలిసి తెలియక చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణంలో అస్సలు చేయకూడని పనులు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

ఫైర్ అయ్యే వస్తువులు

రైలు ప్రయాణంలో బాణాసంచా, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల వంటి త్వరగా మంటలు వ్యాపించే పదార్థాలను తీసుకెళ్లడం నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరం. ఈ రకమైన వస్తువులను రవాణా చేస్తూ పట్టుబడితే రైల్వే శాఖ నిబంధనల ప్రకారం రూ. 1000 వరకు జరిమానా లేదా గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించే అవకాశం ఉంది.

మద్యపానం, ధూమపానం

Advertisement

రైలులో కొందరు పొగతాగడం, మద్యం సేవించడం చేస్తుంటారు. రైలు లోపల, రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్లాట్‌ఫారమ్‌పై ధూమపానం, మద్యపానం చేయడం పూర్తిగా నిషిద్దం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికారులకు పట్టుబడితే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.

టికెట్ లేని ప్రయాణం

కొద్ది దూరమే కదా, ఎవరు చూస్తారులే అనే ఉద్దేశంతో టికెట్ లేకుండా కొందరు ప్రయాణిస్తుంటారు. ఒకవేళ టికెట్ లేకుండా టీటీఈకి పట్టుబడితే.. జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎంత తక్కువ దూరం ప్రయాణించినా ఖచ్చితంగా టికెట్ తీసుకోవడం ఉత్తమం.

Advertisement

Also Read: కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

పెద్దగా మ్యూజిక్ పెట్టడం

రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి బిగ్గరగా మాట్లాడటం, ఎక్కువ సౌండ్‌తో పాటలు వినడం కూడా నిబంధనలకు విరుద్ధమే. మీ వల్ల ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగి వారు ఫిర్యాదు చేస్తే రైల్వే పోలీసులు (GRP) చలానా విధిస్తారు. కాబట్టి తోటి ప్రయాణికుల ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవడం రైలులో చాలా ముఖ్యం.

Also Read: కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ. 210తో జీవితాంతం రూ. 5,000 పెన్షన్.. మధ్యతరగతికి పండగే!

Tags

Related News

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

Advertisement
×