Uppal Accident: ఉప్పల్ ఇండస్ట్రీ ఏరియాలోని హెరిటేజ్ ఫుడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి పింకీ దేవి అనే మహిళ మృతి చెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మహిళను హాస్పిటల్‌కు యాజమాన్యం తరలించారు. దీంతో హెరిటేజ్ కంపెనీ ముందు స్థానికుల ధర్నాకు దిగారు.
మహిళ వ్యర్థాలు పారవేసేందుకు వెళ్లగా డ్రమ్ పేలినట్టు సమాచారం. ఫ్యాక్టరీలో డ్రమ్ ఒక్కసారిగా బలంగా పేలడంతో పింకీ దేవి(36) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉప్పల్ పిఎస్ రామంతాపూర్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్న పింకీ దేవి (35) హెరిటేజ్ ఫుడ్స్‌లో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలను పారవేసేందుకు మొదటి అంతస్తులోని డ్రమ్ ప్రాంతానికి వెళ్లారు.
Also Read: నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?
ఈ క్రమంలో ఒక్కసారిగా డ్రమ్ భారీ శబ్దంతో పేలడంతో పింకీ దేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్‌కు చెందిన హరేంద్ర సాహ్ భార్య. ఆమెకు రీసు, ప్రిన్స్, క్రియాంశ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికులు, హెరిటేజ్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రమ్ పేలుడుకు గల కారణాలు ఏమిటి? అందులో రసాయనాలు లేదా ఇతర పదార్థాలు ఉన్నాయా? ప్రమాదం ఎలా సంభవించిందనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది.
Also read: సన్నీ డియోల్ ఇంటికి సచిన్ కూతురు కోడలిగా ..పెళ్లి వార్తలు వైరల్!