Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) సినిమా పరంగా ఉన్నత శిఖరాలను చేరుకుంది. కానీ వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, రూమర్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక వాటి నుండి బయటపడి ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే గత మూడు ఏళ్ల క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vighnesh shivan) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలు కూడా జన్మించారు.ఇకపోతే వివాహం తర్వాత కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోంది నయనతార. ఇటీవలే తన పెళ్లిరోజు సందర్భంగా విదేశాలలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.
అనుమానాలు రేకెత్తిస్తున్న నయనతార పోస్ట్..
అలాంటి ఈమె సడన్గా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టిన ఒక పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు నయనతార విడాకులు తీసుకోబోతోందా..?అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందా? సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య విభేదాలు రావడం ఏంటి? అసలు విడాకుల వరకు వెళ్లేంత గొడవ ఏం జరిగింది? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లిపై నయనతార అలాంటి పోస్ట్.. ఒంటరితనం కోరుకుంటూ..
అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో..” ఒక తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వివాహం అనేది ఒక పొరపాటుగా మారుతుంది. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా పెద్దవాళ్లు కారు.. నన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది” అంటూ నయనతార పోస్ట్ పెట్టింది. అయితే అలా పోస్ట్ పెట్టిన కాసేపటికే మళ్లీ ఆ పోస్టు డిలీట్ చేసింది. కానీ అంతలోపే ఈ పోస్ట్ బాగా వైరల్ అవ్వడం గమనార్హం. అయితే ఈ పోస్ట్ నయనతార పెట్టిందా లేక నయనతార పేరు పైన ఎవరైనా కావాలనే ఇలా క్రియేట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
నయనతార సినిమాలు..
నయనతార ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ఒకవైపు కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమైంది నయనతార.
లేడీ ఓరియంటెడ్ తో పాటు కమర్షియల్ సినిమాలు కూడా..
అందులో భాగంగానే గతంలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘అమ్మోరు తల్లి 2’ సినిమా చేస్తోంది. అయితే ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇటు టాలీవుడ్ లో అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మెగా 157లో కూడా హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ తో పాటు రూల్స్ ని కూడా బ్రేక్ చేసింది నయనతార.
ALSO READ:AR Rahman: “వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్” లో ఏ.ఆర్ రెహమాన్.. విద్యార్థుల ప్రతిభకు ఫిదా!