BigTV English

Vijay Devarakonda : వెంకన్న సాక్షిగా… పుష్ప డైలాగ్స్ చెప్తే సరిపోదు.. హిట్ కూడా కొట్టాలి విజయ్

Vijay Devarakonda : వెంకన్న సాక్షిగా… పుష్ప డైలాగ్స్ చెప్తే సరిపోదు.. హిట్ కూడా కొట్టాలి విజయ్

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కింగ్డమ్‌’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తిరుపతిలో జరిగిన ఈ వేడుకలో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడి అదరగొట్టారు. అంతేకాదు ఆయన ఏకంగా ‘పుష్ప’ డైలాగును చెప్పి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.


చిత్తూరు యాసలో విజయ్ దేవరకొండ స్పీచ్

ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఈసారి వెంకటేశ్వర స్వామి కరుణిస్తే టాప్ లోకి వెళ్లి కూర్చుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు రౌడీ హీరో మాట్లాడుతూ “మన తిరుపతి ఏడు కొండల ఎంకన్న సామి కానీ, ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో శానా పెద్దోడినై పూడుస్తా… పోయి టాప్‌లో కూర్చుంటా” అంటూ ‘పుష్ప’ స్టైల్ లో డైలాగుతో పాటు తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.


‘పుష్ప’ డైలాగ్ దించేసిన రౌడీ
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ల బాండింగ్ కు గుర్తుగా విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు బన్నీకి స్పెషల్ గా తన రౌడీ బ్రాండ్ బట్టల్ని కూడా పంపుతుంటారు. ఇక ఇప్పుడు ‘కింగ్డమ్’ మూవీ కోసం ఏకంగా ఆయన ‘పుష్ప’ డైలాగును దించేయడం హాట్ టాపిక్ గా మారింది.

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ “ఈసారి గానీ తిరుపతి ఏడుకొండల ఎంకన్న స్వామి నా ఎనకుండి నన్ను బతికించినాడా… సామీ శానా పెద్దోన్నయ్యి పూడుస్తాను సామీ…” అనే డైలాగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే బన్నీ ఇదే డైలాగ్ ని తిరుపతి వేదికగా జరిగిన ‘పుష్ప’ సక్సెస్ మీట్ లో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు సేమ్ డైలాగ్ ని విజయ్ దేవరకొండ వాడడంతో, ఇద్దరూ చెప్పిన ఆ ఒకే డైలాగుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Read Also : చెత్తకుండీలో శవం… అమ్మాయిలను డ్రగ్ తో నల్లగా మాడ్చి మసి చేసే కిల్లర్… సీను సీనుకో ట్విస్ట్

డైలాగ్స్ కాదు హిట్ కావాలి
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా డైలాగ్స్ కాదు హిట్టు కావాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హిట్ అనే మాట విని చాలా కాలమే అవుతుంది. అయితే ఇప్పుడు వెంకన్న సాక్షిగా ‘పుష్ప’ను వాడుకుని, ఆయన పాపులర్ డైలాగ్ చెప్తే సరిపోదు, ‘పుష్ప’ రేంజ్ లో హిట్టు కొట్టాలని కోరుతున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. జూలై 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఆశించిన స్థాయిలో హిట్ కొడతాడా? మరి ఈ రౌడీ హీరో టాప్ ప్లేస్ కు వెళ్లాలని వెంకన్నను కోరిన కోరిక నెరవేరుతుందా? అన్నది చూడాలి.

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×