King Dom Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gawtham Tinnanuri) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కింగ్ డం(King Dom). ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇందులో భాగంగానే నేడు తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది .ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
రాక్షసులకు రాజు అయ్యి కూర్చున్నాడు…
పోలీస్ ఆఫీసర్ గా ఉన్న విజయ్ దేవరకొండ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ ఆపరేషన్ కోసం ఈయన తన ఫ్యామిలీ, తన వాళ్ళందరినీ ఉద్యోగం ఊరు ,అన్ని వదిలేసి వెళ్లిపోతారు. ఇలా ఆపరేషన్ కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లారు ఎలాంటి మనుషుల్ని కలిశారు? అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే విషయాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే ఈయన స్పైగా వెళ్లబోయే ఆ గ్యాంగ్ లీడర్ తన బ్రదర్ అని తెలుస్తోంది. ఇలా ఈ ట్రైలర్ చూస్తుంటే భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడుకొని ఉందని చెప్పాలి. ఇలా ఒక వైపు ఉద్యోగం కోసం బంధాలను కూడా పక్కన పెట్టిన ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. “యుద్ధం ఇప్పుడే మొదలైంది” అంటూ వచ్చే డైలాగులు కూడా సినిమా పట్ల అంచనాలను పెంచేస్తున్నాయి. “ఖైదీలకు మట్టిలోనే ఏందో ఉంది.. మనుషులను కూడా ఖైదీలుగా మారుస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులు అందరికీ రాజు అయ్యి కూర్చున్నాడు” అంటూ వచ్చే డైలాగులు చూస్తుంటే మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలే కలుగుతున్నాయి.
కింగ్ డం పైనే ఆశలు…
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ జూలై 31వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమాపై మరి కాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో కచ్చితంగా విజయ్ దేవరకొండ హిట్ కొడతారని అభిమానులు కూడా భావిస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేకపోవడంతో హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది విజయ్ దేవరకొండ చివరిగా అర్జున్ రెడ్డి గీతగోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు .ఈ సినిమా తర్వాత ఈ స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కింగ్ డం సినిమా విజయ్ దేవరకొండకు మంచి సక్సెస్ అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.