Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల తరచు వివాదాలలో నిలుస్తున్నారు. ఈయన ఏదైనా ఒక సినిమా వేడుకకు వచ్చినా లేదా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొన్న తనకు తెలియకుండానే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా పలు సందర్భాలలో వివాదాలలో నిలిచిన ఈయన ఇటీవల కాలంలో గిరిజనల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఇటీవల పహల్గాం పర్యాటక ప్రాంతంపై ఉగ్రవాదులకు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడిలో భాగంగా ఎంతో మంది పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. ఇలా ఉగ్రవాదుల దాడికి ప్రతీకార చర్యలలో భాగంగా భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)పేరిట ఎదురు దాడులు చేశారు. ఇలా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులను ఉద్దేశించి విజయ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రెట్రో సినిమా వేడుక..
ఈ యుద్ధం సమయంలోనే నటుడు సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా (Retro)ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కాశ్మీర్ కూడా ఇండియాదేనని కాశ్మీర్ వాళ్ళు కూడా ఇండియన్స్ అని తెలిపారు. అదే విధంగా గత ఐదు వందల సంవత్సరాల క్రితం గిరిజనులు ఇలా ఉగ్రవాదులగా కొట్టుకునేవారు కానీ ఈ కాలంలో కూడా ఇలా కొట్టుకోవడం ఏంటి అంటూ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి.
గిరిజనలు ఉగ్రవాదులా?
విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడటంతో గిరిజన సంఘాలు(Tribal Community) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇలా విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ వివరణ కూడా ఇచ్చారు.. తాను ఉదేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ కూడా పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు.
ఇలా విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చినప్పటికీ కూడా గిరిజన సంఘాల నేతలు విజయ్ దేవరకొండపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన సినిమాలను బాయ్ కాట్ (Boy Cott)చేయాలి అంటు పిలుపునిచ్చారు.
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదు
విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్ కాట్ చేయాలన్న గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
గిరిజనులను పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చడం సరైనది కాదంటూ ఆగ్రహం
కింది వర్గాల వారు కూడా సినిమాలు చూస్తేనే హీరో అయ్యారని హెచ్చరిక pic.twitter.com/ySHTDo6Wqm
— BIG TV Breaking News (@bigtvtelugu) June 27, 2025
విజయ్ దేవరకొండ గిరిజనులను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని, కింది వర్గాల వారు కూడా విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు చూస్తేనే ఆయన ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్ కాట్ చేయాలని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఇలా గిరిజన సంఘాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో విజయ్ దేవరకొండ సినిమాలకు ఇబ్బంది తప్పదనే చెప్పాలి. ఇప్పటికే ఇండస్ట్రీలో సరైన హిట్టు లేక సతమతం అవుతున్న విజయ్ దేవరకొండకు ఈ వివాదం కాస్త మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలాగే ఉంది. ఇక విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జులై నెలలో విడుదలకు సిద్ధం కాబోతుందని తెలుస్తుంది.
Also Read: Vijay Devarakonda: కొత్త లుక్ లో విజయ్ దేవరకొండ.. “రౌడీ జనార్దన్” గా మారబోతున్నారా?