Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఒకరు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. రవిబాబు దర్శకత్వంలో తెరకేక్కిన నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ సందడి చేశారు.. అనంతరం పలు సినిమాలలో నటించిన ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిపోయారు. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.
హిట్ కోసం తాపత్రయం…
ఇక అర్జున్ రెడ్డి గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఈ స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. ఈయన పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలను విడుదల చేసినప్పటికీ తన సినిమాలు పూర్తిస్థాయిలో నిరాశపరిచాయి.. ఇక ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఈ రౌడీ హీరో తెగ తాపత్రయం పడుతున్నారు. ఈ క్రమంలోనే విభిన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
కింగ్ డం పై ఆశలు…
ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri)దర్శకత్వంలో సూర్యదేవరనాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన కింగ్ డం (King Dom)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు నిజానికి ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేశారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.
లుక్ మార్చేసిన విజయ్..
ఇకపోతే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో చేయబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించబోతున్నారు ఈ సినిమాకు “రౌడీ జనార్ధన్”(Rowdy Janardhan) అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో దిల్ రాజు నోరు జారారు. ఇక ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కూడా భాగం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా తన లుక్ మార్చేసారని తెలుస్తుంది. జుట్టు పెంచి క్లీన్ షేవ్, మీసాలతో ఈయన ఎంతో విభిన్నంగా కనిపిస్తున్నారు. అయితే ఈ లుక్ రౌడీ జనార్దన్ కోసమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరొక డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే.
Also Read: Coolie Film: మారిపోయిన కూలీ.. కొత్త టైటిల్ ఇదే..కౌంట్ డౌన్ మొదలు!